Gandikota Inter Girl: ‘అన్నా ప్లీజ్ నన్ను వదిలేయ్’.. గండికోట యువతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు!

గండికోటలో మైనర్ బాలిక తనను చంపొద్దని తమ అన్నయ్యలను వేడుకున్నట్లు తెలుస్తోంది. తాను ఏం పాపం చేశాను అన్నా అంటూ ప్రాదేయపడినట్లు సమాచారం. ఆ యువతి ఎంత చెప్పినా వినకుండా కడుపులో తన్ని, చేతులను వెనక్కి విరిచి హత్య చేసినట్లు తెలుస్తోంది.

New Update

కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి అన్నలే తమ చెల్లెలను హత మార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హత్య జరిగిన ప్రాంతంలోనే మృతురాలి అన్నలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాలిక సొంత అన్నయ్య బ్రహ్మయ్య, పెదనాన్న కొడుకు కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Gandikota Inter Girl Murder Case

ఈ క్రమంలో ఈ హత్యకు సంబంధించి పలు విషయలు బయటకొచ్చి సంచలనంగా మారాయి. ఆ మైనర్ బాలిక తనను చంపొద్దని తమ అన్నయ్యలను వేడుకున్నట్లు తెలుస్తోంది. తాను ఏం పాపం చేశాను అన్నా అంటూ ఆ బాలిక ఎంతో ఏడ్చినట్లు సమాచారం. కాళ్లు మొక్కుతూ ఎంతో ప్రాదేయపడినట్లు తెలుస్తోంది. కానీ వారు కొంచెం కూడా కనికరించలేదు. ఆ యువతి ఎంత చెప్పినా.. వారు వినకుండా పిడుగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. 

ఈ దాడిలోనే ఆ యువతి లివర్ చెడిపోయినట్లు సమాచారం. లోపలున్న లివర్ తీవ్రంగా గాయపడి.. నల్లగా కమిలిపోయినట్లు తెలుస్తోంది. కన్నుమొత్తం రంగు మారిపోయినట్లు సమాచారం. తమ పరువు తీస్తున్నావంటూ కోపంతో కడుపులో తన్ని, చేతులను వెనక్కి విరిచి చిత్ర హింసలకు గురి చేసి ఆపై ఆమెను హత మార్చినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా సొంత చెల్లెల్ని వివస్త్రను చేశారు. శరీరంపై బట్టలు లేకుండా నగ్నంగా డెడ్ బాడీని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటనతో కడప జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Gandikota Girl Incident | Gandikota Girl | crime news

Advertisment
తాజా కథనాలు