కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. బాలిక సొంత అన్న బ్రహ్మయ్య, కజిన్ బ్రదర్ కొండయ్యే చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం దీనిని పరువు హత్యగా పోలీసులు తేల్చారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ పరువు తీస్తుందనే కోపంతో అన్నలే హత్య చేశారని పోలీసులు తెలిపారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
Gandikota Inter Girl Incident
అయితే ఈ హత్య కేసులో మరొక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి మర్డర్ కేసులో తల్లి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి అనుమతి లేనిదే కూతుర్ని చంపేశారా! అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతిని, ఆమె ప్రియుడు లోకేషన్‌ను చంపేందుకు బాలిక అన్నలు కుట్ర పన్నినట్లు సమాచారం. దీని కోసం కుటుంబ సభ్యులు దాదాపు 3 నెలలు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ఆ మైనర్ బాలిక తరచూ ప్రియుడు లోకేష్‌తో కలిసి గండికోట వెళ్తోందని తెలుసుకున్న మృతురాలి అన్నలు.. గండికోటలోనే లోకేష్‌ను, తమ చెల్లెని అంతమొందించేందుకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. దీంతో ఎలాగోలా సీసీ కెమెరాల కంట పడకుండా యువతి అన్నలు గండికోట చేరుకోగా.. అప్పటికే లోకేష్ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ పక్కా ప్లాన్ ప్రకారం అన్నలు తమ చెల్లిని చంపినట్లు తేలింది.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
దీంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. అనంతరం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సొంత అన్న బ్రహ్మయ్య, పెద్దనాన్న కొడుకు కొండయ్య యువతి బావ తోట సుబ్రహ్మణ్యం, మరో బంధువు సుబ్బయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. యువతి మరో అన్న సురేంద్ర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో ఎవరెవరు సూత్రదారులు, పాత్రదారులు అని తేల్చే పనిలో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
gandikota inter student case | Gandikota Girl | gandikota case latest