War 2 Trailer: ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా.. 'వార్ 2' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

ఇద్దరు స్టార్ హీరోల కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ట్రైలర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జులై 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

New Update

War 2 Trailer: ఇద్దరు స్టార్ హీరోల కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ట్రైలర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జులై 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే జులై 25నే ట్రైలర్ విడుదల చేయడానికి ఓ ప్రత్యేకత ఉంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్  ఇద్దరూ  సినీ పరిశ్రమలో అడుగుపెట్టి  25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని YRF 'వార్ 2' ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయాలని నిర్ణయించింది

ఆగస్టు 14న 

2019 లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన 'వార్' సీక్వెల్ గా 'వార్ 2' రూపొందించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ 'కబీర్' పాత్రలో తిరిగి వస్తుండగా.. ఎన్టీఆర్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ గా నటించింది. 'ఏక్ థా టైగర్', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన ' యష్ రాజ్ ఫిలిమ్స్' ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా ఇండిపెండ్స్ డే సందర్భంగా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మొత్తం మూడుకు పైగా భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో తెలుగు మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్ సితార ఎంటర్ టైనమెంట్స్ నాగవంశీ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లై తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో హృతిక్- ఎన్టీఆర్ హై ఎండ్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూడడం ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అనే చెప్పాలి! 

Also Read: Pawan Kalyan: ప్లాపుల్లో నా కోసం నిలబడిన మిత్రుడు త్రివిక్రమ్.. పవన్ ఎమోషనల్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు