Maargan OTT Date
Maargan OTT Date: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) రీసెంట్ బ్లాక్ బస్టర్ “మార్గన్: ది బ్లాక్ డెవిల్” OTT రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రైమ్‑థ్రిల్లర్ 2025 జూన్ 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఈ సినిమాకి విజయ్ ఆంటోని నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మూడు పాత్రలు పోషించారు. ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని విజయ్ ఆంటోని కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది.
లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మంచి కథా, నిర్మాణంతో పాటు విజువల్‌గా కూడా ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ ప్రముఖ ఓటీటీ వెబ్‌సిరీస్ ప్లాట్‌ఫారమ్ "టెంట్‌కొట్ట”లో, తమిళం వర్షన్‌గా జూలై 25న స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. ఇక తెలుగు వర్షన్‌ను అమెజాన్ ప్రైమ్(Maargan on Amazon Prime) యూజర్లు అదే తేదీన వీక్షించవచ్చు.
25 days of #Maargan
— Ramesh Bala (@rameshlaus) July 22, 2025
A genuine success.. ✨️ @vijayantony@leojohnpaultwpic.twitter.com/YSGTlk0k58
“మార్గన్: ది బ్లాక్ డెవిల్” రివ్యూ:
బ్లాక్ బస్టర్ విజయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మార్గన్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. నగరంలో రమ్య అనే యువతిని ఒక ఇంజక్షన్ ద్వారా హత్య చేస్తారు. దీంతో ఆమె శరీరం కాలిపోయిన మాదిరిగా నలుపు రంగులోకి మారి చనిపోతుంది. ఇలా “బ్లాక్ డెవిల్” అవతారంలో చెత్తకుప్పలో పడి ఉన్న ఆమె డెడ్ బాడీని బయటకు తీస్తారు.
ఈ సంచలన కేసును తెలుసుకోడానికి పోలీస్ ఆఫీసర్ ధృవ (Vijay Antony) రంగం లోకి దిగుతాడు. పదేళ్ల క్రితం తన కూతురును కూడా ఇలాంటి స్థితిలో కోల్పోయిన ఆయన, ఈ కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టి పని చేస్తుంటాడు.
ధృవ కేస్ ఆధారాలను పరిశీలిస్తూ, అనుమానాస్పదంగా ఉన్న యువకుడు డి. అరవింద్ (అజయ్ దిశాన్) ను అదుపులోకి తీసుకుంటాడు. కానీ అరవింద్ ప్రవర్తనలో కనిపించే కొన్ని శక్తులు, అనూహ్యమైన సందర్భాలు ధృవకి కొత్త అనుమానాలను తెస్తాయి.
కథలో ఇతర పాత్రలు..
ధృవకి సహకరించే అఖిల, శ్రుతి, రమ్య, వెన్నెల, మేఘల వంటి మల్టీ‑డైమెన్షనల్ పాత్రలతో కథ పుంజుకుంటుంది. ప్రతి పాత్రలోని సస్పెన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
చివరికి హంతకుడి ఎవరు, కేసు రాబోయే ట్విస్ట్‌లతో ఎలా లింక్ అవుతుందో తెలుసుకోడానికి "మార్గన్: ది బ్లాక్ డెవిల్" చూడాల్సిందే. ఈ సినిమాతో విజయ్ ఆంటోని మళ్ళీ తన మల్టీ‑టాస్క్ టాలెంట్ ను ప్రేక్షకుల ముందుకు సక్సెస్‌ఫుల్ గా తీసుకొచ్చారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
థియేటర్ రిలీజ్: 2025, జూన్ 27
OTT-తమిళ్: టెంట్‌కొట్ట - జూలై 25
OTT-తెలుగు: అమెజాన్ ప్రైమ్ - జూలై 25
Also Read: Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే