/rtv/media/media_files/2025/07/22/telangana-tet-results-2025-07-22-11-52-53.jpg)
Telangana TET Results
Telangana TET Results:
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం1,37,429 మంది పరీక్షలు రాశారు. కాగా టెట్ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. మొదటి పేపర్‌లో 61.50 శాతం ఉత్తీర్ణత సాధించగా రెండవ పేపర్ లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.90,205 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయగా 30,649 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్https://tgtet.aptonline.in/tgtet/తో పాటు https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
కాగా, టీజీ టెట్ పరీక్షకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ -2 ఆరు సెషన్‌లలో 7 భాషలలో అంటే తెలుగు, హిందీ, ఉర్ధూ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాళీలలో నిర్వహించబడింది.
పేపర్ 2 పది సెషన్‌లలో 7 భాషల్లో అంటే తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో "గణితం, విజ్ఞాన శాస్త్రం లేదా సాంఘిక శాస్త్రం విషయ నిపుణతలో నిర్వహించబడింది.