/rtv/media/media_files/2025/07/22/bonalu-mutton-2025-07-22-20-00-10.jpg)
ఫ్రిజ్‌లో ఉంచిన మటన్ ను వేడి చేసి తినడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా అతని ఫ్యామిలీలోని మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం పీఎస్ పరిధి చింతల్‌కుంటలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌కుంట ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్ యాదవ్ (46) ఆదివారం బోనాల పండగ సందర్భంగా ఇంటికి మటన్ బోటి, చికెన్ తీసుకువచ్చాడు. వాటిని రాత్రి వండుకుని తిన్నారు. మిగిలిన భాగాన్ని ఫ్రీజ్ లో ఉంచారు.
Also Read : వివో నుంచి మరో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఈసారి తగ్గేదే లే!
Also Read : భారత్‌కు బద్ధ శత్రువుగా మారుతున్న బంగ్లాదేశ్.. 10 షాకింగ్ పరిణామాలు!
కాసేపటికే వాంతులు, విరేచనాలు
మరుసటి రోజు ఫ్రీజ్ లో నుంచి బయటకు తీసి వేడి చేసి మళ్లీ తిన్నారు. కాసేపటికే కుటుంసభ్యులందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతిచెందారు. మిగిలిన ఏడుగురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందా అనే, అనుమానాలు నెలకొన్నాయి.
Also Read : పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
Also Read : వీరమల్లు చెప్పిన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎక్కడుంది.. ధర ఎంత ఉండొచ్చు!
telugu-news | hyderabad | food poisioning | bonalu 2025