Farokh Engineer : భార‌త క్రికెట్‌ దిగ్గజానికి అరుదైన గౌర‌వం!

భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ కు ఇంగ్లండులో అరుదైన గౌరవం దక్కింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు ఫరూఖ్ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ల్యాంక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది.

New Update
Farokh Engineer

Farokh Engineer

Farokh Engineer : భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ కు ఇంగ్లండులో అరుదైన గౌరవం దక్కింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు ఫరూఖ్ పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ల్యాంక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. ఫరూఖ్ ల్యాంక్‌షైర్ జట్టులో దాదాపు పది సంవత్సరాలు క్రికెట్ ఆడారు. 1968 నుంచి 1976 మధ్యకాలంలో ఆయన 175 మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు. 5,942 పరుగులు చేసిన ఆయన, వికెట్ కీపర్‌గా 429 క్యాచులు పట్టిన ఘతన సొంతం చేసుకున్నారు. అంతేకాక 35 స్టంపింగ్‌లు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య 

 ల్యాంక్‌షైర్ తరఫున నాలుగు సార్లు జిల్లెట్ కప్‌ను గెలుచుకోవడంలో ఫరూఖ్ ది ప్రత్యేక స్థానం. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ ఫరూక్‌ది అందేవేసిన చేయి. ఆయనకున్న ఆ నైపుణ్యమే టీము విజయానికి దోహదపడింది.  ఈ సేవలకు గుర్తుగా స్టాండ్‌కు ఆయన పేరును పెట్టాలని క్లబ్ నిర్ణయించింది.ఫరూఖ్‌తో పాటు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్లైవ్ లాయిడ్ పేరు కూడా మరో స్టాండ్‌కు పెట్టనున్నారు. లాయిడ్ దాదాపు రెండు దశాబ్దాలు ల్యాంక్‌షైర్ తరఫున ఆడారు. క్లబ్ క్రికెట్ అభివృద్ధిలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారని క్లబ్ కొనియాడింది. వారి సేవలకు గుర్తుగా స్టాండులకు వారి పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు క్లబ్‌ వెల్లడించింది.

Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు


“ఫరూఖ్, లాయిడ్‌లు మా క్లబ్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. వారిద్దరూ ఈ గౌరవానికి అర్హులు. వారి పేర్లతో స్టాండ్స్ ఏర్పాటు చేయడం మాకు గౌరవం” అని క్లబ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ విషయాన్ని భారత క్రికెట్ అభిమానులు భారత క్రికెట్‌కు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. విదేశాల్లోనూ భారత క్రికెటర్లకు ఇలా గుర్తింపు రావడం దేశానికే గర్వకారణంగా వారు అభివర్ణిస్తున్నారు.  

Also Read: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్

Advertisment
తాజా కథనాలు