/rtv/media/media_files/2025/07/22/jagdeep-dhankhar-2025-07-22-08-44-10.jpg)
Jagdeep Dhankhar
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలవల్లే తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత చరిత్రలో పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వాళ్లలో జగ్‌దీప్ ధన్‌ఖడ్ మూడోవారు. ఈయనకు ముందు ఇద్దరు రాజీనామా చేశారు. వాళ్లలో వీవీ గిరి ఒకరు. ఈయన రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు రాజీనామా చేశారు. మరొకరు భైరాన్ సింగ్ శెకావత్. ఈయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో పదవీ కాలానికి నెల రోజుల ముందుగానే రాజీనామా చేశారు. అలాగే మరో ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించారు.
Also Read: 150 లగ్జరీ కార్లు కొట్టేసి.. 20 ఏళ్లుగా ఎంజాయ్..చివరికి
తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు ?
ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే భారత ఎన్నికల సంఘం కొత్త వ్యక్తిని ఎన్నుకునేందుకు ప్రక్రియ ప్రారంభిస్తుంది. 60 రోజుల్లోనే కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సెప్టెబంబర్ 19 లోపు కొత్త ఉప రాష్ట్రపతి రానున్నారు. అప్పటివరకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న హరివంశ్ తాత్కాలికంగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సంప్రదించి ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే ఈ పదవి బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ప్రధాని మోదీ NDA నేతలతో కలిసి చర్చిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉపరాష్ట్రపతిని ఉభయ సభల ఎంపీలు కలిసికట్టుగా ఎన్నుకోనున్నారు.
Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
మరోవైపు జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ స్పందించారు. ధన్‌ఖడ్ చెబుతున్న కారణం నమ్మశక్యంగా లేదని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయనతోనే ఉన్నాని.. రాత్రి 7.30 గంటలకు కూడా ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు.ఆయన రాజీనామా వెనుక బయట చెబుతుంది కాకుండా ఇంకేదో విషయం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు.