BIG BREAKING: కవిత సంచలన వ్యాఖ్యలు.. వారికి సీరియస్ వార్నింగ్!

చట్టబద్ధంగా బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కుండా స్థానిక ఎన్నిక‌లు నిర్వహించాల‌నుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను బీసీలు వదిలి పెట్టరని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం సీఎం రేవంత్ కేంద్రంపై ఒత్తిడి తేవ‌డం లేదన్నారు.

New Update
MLC Kavitha New Party News

MLC Kavitha New Party News

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీసీ రిజ‌ర్వేష‌న్లకు బీజేపీ నాయ‌కులు మ‌తం రంగు పులమడం బాధాక‌రమన్నారు. గుజ‌రాత్ లో ఏ ర‌క‌మైన రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నారో అంద‌రికీ తెలుసన్నారు. తెలంగాణ‌లో ఆ పార్టీకి ఓట్లు రావ‌ని తెలిసి బీజేపీ నాయ‌కులు ఈ ర‌క‌మైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ‌తో స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఈ విష‌యంలో బీజేపీ ప్రభుత్వం సాకులు చెబుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ బీసీల‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజ‌ర్వేష‌న్లను దూరం చేస్తోందన్నారు.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Also Read: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా

తక్షణమే ఆర్డినెన్స్ తేవాలి..

ఫ్లైట్ మోడ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంలో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశారన్నారు. కానీ ఢిల్లీలో ప్రధాని మోదీపై బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవ‌డం లేదన్నారు. పార్టీ ప‌రంగా బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలు పార్టీ ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు కోరుకోవ‌డం లేదన్నారు. వారు చ‌ట్ట బద్ధమైన, రాజ్యాంగ‌ బద్ధమైన రిజ‌ర్వేష‌న్లు కోరుకుంటున్నారన్నారు. చట్టబద్ధంగా బీసీ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కుండా ఎన్నిక‌లు నిర్వహించాల‌నుకుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను బీసీలు వదలి పెట్టరని హెచ్చరించారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఆర్డినెన్సును తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

Also Read: Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు

bc reservations | brs-mlc-kalvakuntla-kavitha | telugu breaking news | telugu-news

Advertisment
తాజా కథనాలు