HariHara VeeraMallu: వాచిపోయే బడ్జెట్తో వీరమల్లు మేకింగ్.. ఎంతొస్తే సేఫ్!

'హరిహరవీరమల్లు' మరో 24 గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలు, సినిమా హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాం.. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో సెట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

author-image
By Archana
New Update

HariHara VeeraMallu:  నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ 'హరిహరవీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమోడీ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ను.. ఆ తర్వాత జ్యోతికృష్ణ టేకోవర్ చేసి పూర్తిచేశాడు. మరో 24 గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలు, సినిమా హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాం.. 

'హరిహరవీరమల్లు' హైలైట్స్ 

ప్రధాన ఆకర్షణగా సెట్స్

పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో సెట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మూడు సెట్స్ హైలైట్ గా కనిపించబోతున్నాయి. దర్బార్ పోర్ట్, మచిలీపట్నం బందర్ పోర్ట్, చార్మినార్ సెట్లను భారీ ఖర్చుతో నిర్మించారట. ఇక  చార్మినార్ సెట్ విషయానికి వస్తే.. నిజమైన చార్మినార్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ లో నిర్మించారట. ప్రొడక్షన్ డిజైనర్ తోట తర్రాని ఈ సెట్‌ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇదొక పీరియాడిక్ డ్రామా కావడంతో అప్పటి మొఘల్ కాలపు రాజభవనాలు, యుద్ధ భూములు, ప్రాచీన నగరాలు, దేవాలయాలను ప్రేక్షకులకు  కళ్లకు కట్టినట్లుగా  చూపించడానికి ఈ సెట్‌లను చాలా శ్రద్ధగా డిజైన్ చేశారట మేకర్స్. 

హై ఎండ్ సినిమాటిక్ వాల్యూస్ తో  'హరిహరవీరమల్లు' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్లు ఖర్చు చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో, బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించడం సినిమా విజయానికి కీలకం. 'హరి హర వీరమల్లు' బ్రేక్ ఈవెన్ సాధించాలంటే  రూ. 127 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. అలాగే  క్లీన్ హిట్ కావాలంటే రూ. 260 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు  రూ. 200- 260 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్ అయినట్లని చెబుతున్నారు. 

పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ 

ఈ సినిమాలో పవన్ కొరియోగ్రాఫ్ చేసిన 20 నిమిషాల క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని దర్శకుడు జ్యోతికృష్ణ తెలిపారు. ఈ ఒక్క సన్నివేశం కోసం ఏకంగా 57 రోజుల షూటింగ్ జరిగిందట! పవన్ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో స్వయంగా దీనిని కొరియోగ్రఫీ చేశారు.

 పవన్ మేకోవర్

ఈ సినిమాలో  వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మేకోవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. పవన్ ఈ పాత్ర కోసం  తన లుక్‌ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారు.

ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ 

 ఆస్కార్ విజేత  ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ గా మారబోతుందని మేకర్స్ తెలిపారు. ఆయన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు కొత్త జీవం పోస్తాయని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల 

హరిహర వీరమల్లు పవన్ తొలి పాన్ ఇండియా సినిమా.  ఈ సినిమా  తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  విడుదల కానుంది.

సవాళ్లతో కూడిన నిర్మాణం

 కోవిడ్ మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు వంటి కారణాల వల్ల  సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీనివల్ల అనేకసార్లు వాయిదా పడింది.  అయినప్పటికీ, నిర్మాత ఏ.ఎం. రత్నం,   దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ పట్టుదలతో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.

Also Read : నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావే కారణం...ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్

Advertisment
తాజా కథనాలు