/rtv/media/media_files/2025/07/22/pawan-kalyan-harihara-veeramallu-movie-not-being-screened-in-aaa-theatre-2025-07-22-19-58-31.jpg)
Pawan Kalyan Harihara Veeramallu movie not being screened in AAA theatre
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ అంచనాలతో ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే జూలై 23న ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోలను కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత సాధారణ షోలు జూలై 24 నుంచి థియేటర్లలోకి రానున్నాయి.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
హరిహర వీరమల్లుకు బ్రేక్
ఈ క్రమంలో ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో ఉన్న ‘AAA’ థియేటర్‌లో మాత్రం ఈ మూవీ షోలు లేవని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ‘AAA’ పేరుతో అల్లు అర్జున్ థియేటర్ ఉంది. ఈ థియేటర్‌లో ప్రతి సినిమాను ప్రదర్శిస్తారు. కానీ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ షోలు మాత్రం ఇందులో ప్రదర్శించడం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఈ న్యూస్ వైరల్ కావడానికీ ఓ కారణం ఉంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్న పలు థియేటర్లలో ఈ మూవీ షోలకు సంబంధించిన టికెట్ వివరాలు వెల్లడయ్యాయి. కానీ అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్‌లో మాత్రం ఈ మూవీ జాడే కనిపించలేదు.
ప్రీమియర్స్ కానీ, సాధారణ షోలకు సంబంధించిన టికెట్ వివరాలు కానీ బుక్ మై షోలో ప్రదర్శించలేదు. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు విభేదాలు ఉన్నాయని.. అందువల్లనే ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని తన థియేటర్‌లో బన్నీ ప్రదర్శించడం లేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. దీంతో మరోసారి మెగా ఫ్యామిలీ VS అల్లు ఫ్యామిలీ మధ్య వార్ ఇంకా చల్లారలేదన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
Hari Hara Veera Mallu | Pawan Kalyan | aaa-cinimas | Allu Arjun | premier-shows-ecords | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | 2025 Tollywood movies | breaking news in telugu | hyderabad | latest telangana news | telangana news live updates | telangana news today | telangana-news-updates