/rtv/media/media_files/2025/07/22/pune-fake-rape-case-2025-07-22-16-08-38.jpg)
తన అపార్ట్‌మెంట్‌లో డెలివరీ ఏజెంట్ గా నటిస్తూ ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయేలా చేశాడని తన ఫిర్యాదులో వెల్లడించింది. అంతేకాకుండా జరిగిదంతా ఫోన్ లో రికార్డు చేశాడని, ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడని పోలీసులకు వెల్లడించింది. ఈ 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు లోతుగా విచారణ చేయంతో ఈ మహిళా టెక్కీ అబద్ధపు ఫిర్యాదు చేసిందని తేలింది.
Also Read : రాకుమారిలా ముస్తాబైన శ్రీముఖి.. అబ్బా ఫొటోలు భలే ఉన్నాయి!
అదే ఫ్లాట్‌లో ఇద్దరూ కలిసి
పోలీసు దర్యాప్తులో ఆ మహిళ చెప్పిన దానిలో అనేక వ్యత్యాసాలు కనిపించాయి. సంఘటన జరిగిన రోజు రాత్రి 7:30 నుండి 8:45 గంటల మధ్య వారిద్దరూ అదే ఫ్లాట్‌లో ఉన్నారని తేలింది. ముఖ్యంగా, దర్యాప్తులో అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా చొరబడినట్లు ఎటువంటి ఆధారాలు, మత్తుమందు స్ప్రే జాడలు, శారీరక దాడికి సంబంధించిన సంకేతాలు ఏవీ కనిపించలేదు. 500 కి పైగా కెమెరాల నుండి CCTV ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసుల.. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దర్యాప్తులో ఆ వ్యక్తి అపరిచితుడు కాదని, ఇద్దరికి సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా పరిచయం ఉందని తేలింది. అదే రోజు ఇద్దరు చాలా క్లోజ్ గా సెల్ఫీని కూడా తీసుకున్నట్లుగా బయటపడింది.
Also Read : ఢిల్లీలో 6 గురు ఎంపీల సీక్రెట్ మీటింగ్.. TBJPలో అసలేం జరుగుతోంది?
పోలీసుల విచారణలో డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన వ్యక్తి ఆమె స్నేహితుడేనని పోలీసుల గుర్తించారు. అంతేకాకుండా ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని కావాలనే యువతి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని తేల్చారు పోలీసులు. దీంతో పోలీసులు ఉల్టా సదరు యువతిపైనే కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 212, 217 (ప్రభుత్వ ఉద్యోగికి తప్పుడు సమాచారం అందించడం) మరియు 228 (తప్పుడు సాక్ష్యాలను కల్పించడం) కింద నాన్-కాగ్నిజబుల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : అంతా ఫేక్.. సోనూ సూద్ నుంచి ఒక్క రూపాయి రాలేదు - ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్
Also Read : ఈ ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు.. పవన్ పై రోజా సంచలన కామెంట్స్!
telugu-news | maharastra | pune | Rape Complaint