UAE : దారుణం.. బర్త్‌డే రోజునే భర్త  చంపేశాడు...గొంతుకోసి!

దుబాయ్‌ షార్జాలో దారుణం జరిగింది. కేరళలోని కొల్లంకు చెందిన అతుల్య అనే వివాహిత దారుణహత్యకు గురైంది.   అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు ఆమె భర్త సతీష్.  కేరళకు చెందిన సతీష్, అతుల్యకు 2013లో పెళ్లి అయింది.  

New Update
uae women

దుబాయ్‌ షార్జాలో దారుణం జరిగింది. కేరళలోని కొల్లంకు చెందిన అతుల్య అనే వివాహిత దారుణహత్యకు గురైంది.   అదనపు కట్నం కోసం భార్యను చంపేశాడు ఆమె భర్త సతీష్.  కేరళకు చెందిన సతీష్, అతుల్యకు 2013లో పెళ్లి అయింది.  వీరిద్దరూ 2023 నుంచి షార్జాలో జీవిస్తున్నారు.  పెళ్లిలో 43తులాల బంగారం, ఓ బైక్‌ కట్నంగా ఇచ్చారు అతుల్య పేరెంట్స్. అయినప్పటికీ గతకొంత కాలంగా అదనపు కట్నం కోసం అతుల్యకు వేధింపులకు గురి చేస్తున్నాడు సతీష్.  భర్త తీరుతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు నెలకొన్నాయి.  పలుమార్లు అతుల్యను సతీష్ చిత్రహింసలు పెట్టాడు. అతుల్యను తీవ్రంగా గాయపరిచేవాడు సతీష్.

Also Read :  తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

కూతురు కోసమే వేధింపులు భరించానంటూ

భర్త దాడి చేసిన వీడియోలను సోదరికి పంపింది అతుల్య.  తన కూతురు కోసమే వేధింపులు భరించానంటూ సోదరికి మెసేజ్‌లు పెట్టింది అతుల్య. అయితే అనుమానాస్పద స్థితిలో అతుల్య మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  భర్త సతీషే చంపేశాడని ఆరోపిస్తున్నారు. జూలై 19 మధ్య సతీష్ తనను గొంతు కోసి, కడుపులో తన్నాడని, తలను ప్లేట్ తో కొట్టాడంతో ఆమె మరణించిందని ఆమె తల్లి ఆరోపించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూయడం గమనార్హం.  అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ఉంది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది.

Also Read :  POKలో తిరగబడ్డ పోలీసులు.. పాకిస్తాన్ కు ఇది మామూలు దెబ్బ కాదు!

ఈ నెల ప్రారంభంలో షార్జాలో 32 ఏళ్ల కేరళ మహిళ తన పసిబిడ్డతో మృతి చెంది కనిపించడంతో, ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లం జిల్లాకు చెందిన విపంచిక మణియన్ జూలై 8న తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు ఏడాది వయసున్న కూతురు కూడా శవమై కనిపించింది. మలయాళంలో చేతితో రాసిన నోట్ ఆమె  ఇంట్లో దొరికింది, అందులో మానసిక క్షోభ, వరకట్న వేధింపుల ఆరోపణలకు గురైనట్లుగా వెల్లడించింది.  మణియన్ కుటుంబం కూడా ఆమె భర్త నిధీష్ వలియవీట్టిల్ మరియు అతని కుటుంబం శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించింది.

Also Read :  ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా.. 'వార్ 2' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

Also Read :  నారాయణఖేడ్‌ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు..అమ్మాయిల గదుల్లోకి వెళ్లి...

uae | kerala women | kerala | telugu-news

Advertisment
తాజా కథనాలు