/rtv/media/media_files/2025/07/22/pawan-kalyan-help-to-fish-venkat-2025-07-22-16-53-04.jpg)
pawan kalyan help to fish venkat
నటుడు ఫిష్ వెంకట్ మృతిపై టాలీవుడ్ కనీసం స్పందించకపోవడంపై అతడి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా RTV మీడియాతో మాట్లాడిన ఆమె.. సినీ పెద్దలు సహాయం చేసుంటే తన భర్త బతికేవాడని వాపోయింది. పవన్ కళ్యాణ్ మాత్రమే తమకు రూ. 2 లక్షలు ఇచ్చారని తెలిపింది. ప్రభాస్, సోనూ సూద్ తమకు డబ్బులు ఇచ్చారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఉన్నప్పుడు పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదని, కొందరు మాత్రమే చిన్న మొత్తాల్లో సహాయం చేశారని ఆమె అన్నారు. ఆయన అభిమానులు మాత్రం బాగా సహాయం చేశారని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి తమకు తగినంత మద్దతు లభించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. ఈ ఏరియాల్లో కుమ్ముడే కుమ్ముడు
Also Read : వాచిపోయే బడ్జెట్తో వీరమల్లు మేకింగ్.. ఎంతొస్తే సేఫ్!
Also Read : పొలంలో నాట్లు వేసిన రింకూ సింగ్‌కు కాబోయే భార్య.. ఎంపీ వీడియో వైరల్
ఫేక్ కాలా లేక నిజమా?
సోనూ సూద్ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి డబ్బు అందలేదని పేర్కొన్నారు. అది కూడా ఫేక్ కాలా లేక నిజమా? అనేది తనకు కూడా అర్థం కావడం లేదని ఫిష్ వెంకట్ భార్య ఎమోషనల్ అయ్యారు.
కిడ్నీ ఫెల్యూర్ తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వెంకట్ కు ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఫిష్ వెంకట్ కుటుంబం దాదాపు నెలరోజుల పాటు ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూసింది. టాలీవుడ్ పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే ఆయన బతుకుతారని వేడుకున్నారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్, హీరో విశ్వక్ సేన్ వంటి పలువురు తమవంతు ఆర్థిక సాయం అందించారు. కానీ చివరకు పరిస్థితి విషమించడంతో జులై 18న ఆయన కన్నుమూశారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
telugu-news | Latest News