POKలో తిరగబడ్డ పోలీసులు.. పాకిస్తాన్ కు ఇది మామూలు దెబ్బ కాదు!

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో సామన్య ప్రజల తర్వాత ఇప్పుడు అక్కడి పోలీసులు కూడా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుబాటు ప్రారంభించారు. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో వందలాది మంది పోలీసులు నిరసనకు దిగారు.

New Update
POK Police

POK Police

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (POK)లో సామన్య ప్రజల తర్వాత ఇప్పుడు అక్కడి పోలీసులు కూడా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుబాటు ప్రారంభించారు. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో వందలాది మంది పోలీసులు నిరసనకు దిగారు. విధుల్లోకి చేరేందుకు నిరాకరించారు. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా పీవోకేలో కశ్మీరుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. అలాగే ఆర్థిక దోపిడీ, పరిపాలన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. 

Also Read: 224 మంది పోలీసులు మిస్సింగ్.. హోంశాఖలో కలకలం..

Pok Policemen Started Indefinite  Strike

పోలీసుల మరణం తర్వాత వారి పొదుపు డబ్బులు కూడా కుటుంబాలకు ఇవ్వడం లేదని అంటున్నారు. గత 50 ఏళ్లుగా మరణించిన పోలీసులు కుటుంబాలకు ఇచ్చే పెన్షన్‌ను పెంచలేదన్నారు. అలాగే పీవోకేలో పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నప్పటికీ కూడా సైనిక అధికారులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే సౌకర్యాలు అందిస్తున్నారని అంటున్నారు. పోలీసులను వారి కుటుంబాలను సెకండ్ క్లాస్ పౌరులుగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు కూడా పెద్ద ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని.. అలాగే బయట చికిత్స చేసుకుంటే ఎలాంటి ఆలస్యం లేకుండా డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.  

Also Read :  నారాయణఖేడ్‌ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు..అమ్మాయిల గదుల్లోకి వెళ్లి...

వాస్తవానికి పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న పోలీసులు వారి కుటుంబాలకు బయట ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే వాళ్ల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. సైన్యం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ పీవోకేలోని పోలీసులకు మాత్రం ఇలాంటి సౌకర్యం లేదని వారు వాపోతున్నారు. గత 70 ఏళ్లుపై తమపౌ సవతి తల్లి వైఖరి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే 2008 నాటి పాత్ బేసిక్‌ ప్రకారం కాకుండా.. 2022 స్కేల్‌ ప్రకారం రిస్క్‌ భత్యం చెల్లించాలని కోరుతున్నారు. సైనికులకు, రేంజర్లకు రెండుసార్లు ఇచ్చిన అసమానత భత్యం కూడా ఇవ్వాలని.. ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని భత్యం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: ఆ 3 గంటల్లో అసలేం జరిగింది.. ధన్‌ఖడ్‌ రాజీనామాకు బలమైన కారణం అదేనా?

ప్రస్తుతం పీవోకేలో పోలీసులు చేస్తున్న సమ్మేలో అక్కడి రెవెన్యూ శాఖ ఉద్యోగులు కూడా పాలుపంచుకుంటున్నారు. జులై 27 వరకు నల్ల బ్యాండ్లు ధరించి పనిచేస్తున్నారు. పాక్‌లోని ఇతర ప్రాంతాల మాదిరిగా తమకు సమాన హక్కులు ఇవ్వకపోతే  ఆగస్టు 3 నుంచి వారు కూడా సమ్మేకు దిగనున్నారు.   

Also Read :  పవన్ కల్యాణ్ గాలినాకొడుకు..  రోజా సంచలన కామెంట్స్!

pakistan | rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు