Nitish Kumar: 'నెక్ట్స్ ఉపరాష్ట్రపతి నితీష్.. సీఎం పదవికి రాజీనామా!'

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా అనేక అనుమానాలకు దారితీస్తోంది. బిహార్‌లో BJP సొంత పార్టీ నాయకుడిని సీఎం చేయాలనుకుంటుందని RJD ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ అన్నారు. నితీష్‌ని సీఎం పదవికి రాజీనామా చేయించి ఉపరాష్ట్రపతిగా నియమించనుందని వార్తలు వస్తున్నాయి.

New Update
_Nitish Kumar

Nitish Kumar will be Vice President

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం రాజీనామా చేశారు. మంగళవారం ఆయన రాజీనామా ఆమోదించబడింది. కానీ ఆయన రాజీనామా అకస్మాత్తుగా జరిగిన తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఎందుకంటే ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. దీనిపై త్వరలో జరగనున్న బీహార్‌ ఎన్నికల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై, ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. నితీష్‌ కుమార్‌ని ఉపరాష్ట్రపతిని చేయడానికి జగదీప్‌ దన్‌ఖడ్ చేత రాజీనామా చేయించారని ఆయన అన్నారు.

Also Read :  YCP Roja : పవన్ కల్యాణ్ గాలినాకొడుకు..  రోజా సంచలన కామెంట్స్!

Nitish Kumar Will Be Vice President

తర్వాత బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ కూడా ఆ పదవికి రాజీనామా చేయనున్నారని చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల వరకు బీహార్‌లో బీజేపీ సొంత పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటుందని ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ అన్నారు. తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలుస్తే బీజేపీ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ రాజీనామా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్దే అవుతుంది. రాజకీయంగా జేడీయూను నాశనం చేయడానికి బీజేపీ కంకనం కట్టుకుందని ఆయన అన్నారు. నితీష్ కుమార్‌కు దగ్గరగా ఉన్న నాయకులను బీజేపీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఆట మొదలైంది. 

Also Read :  Gandikota Girl: తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

Also Read :  UAE : దారుణం.. బర్త్‌డే రోజునే భర్త  చంపేశాడు...గొంతుకోసి!

ఆర్జేడీ వాదనపై జేడీయూ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. జేడీయూ కోటా మంత్రి మదన్ సాహ్ని ముఖేష్ రోషన్ వ్యాఖ్యలను ఖండించారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి కారని, ఆయన బీహార్ ముఖ్యమంత్రిగానే ఉంటారని మదన్ సాహ్ని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన సీఎం పదవిలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆర్జేడీ తప్పుడు, కల్పిత వాదనలు చేస్తోందని చెప్పారు. 

ఎన్డీఏలో ఎవరినీ బలవంతం చేయడం లేదు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారని మదన్ సాహ్ని అన్నారు. ఆయనను బలవంతంగా తొలగించలేదు. ఆయన రాజీనామాను నితీష్ కుమార్‌తో ముడిపెట్టకూడదు. వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షం సభ లోపల, వెలుపల ఓటర్ల జాబితా సవరణ ప్రచారాన్ని అడ్డుకుంటోంది. దానిని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ఉంది. దీనిపై ప్రతిపక్షం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన అన్నారు.

Also Read :  POKలో తిరగబడ్డ పోలీసులు.. పాకిస్తాన్ కు ఇది మామూలు దెబ్బ కాదు!

vice-president | jagdeep-dhankhar | Jagdeep Dhankhar resigns | nithish-kumar | bihar-cm-resigns | bihar-cm-nitish-kumar | bihar-cm | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు