HHVM : వీరమల్లు చెప్పిన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎక్కడుంది.. ధర ఎంత ఉండొచ్చు!

కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది.  దాని చరిత్ర సుదీర్ఘమైనది, ఎన్నో చేతులు మారింది. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం, కొల్లూరు గనులలో లభ్యమైందని చరిత్రకారులు చెబుతున్నారు.

New Update
hhvm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు.   భారీ పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా..  కీరవాణీ సంగీతం అందించారు.  ఈ సినిమా కథ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది.ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిరంకుశత్వం, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేతను చూపించునున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలలో  ఈ సినిమా కథ గురించి మాట్లాడుతూ..  కోహినూర్ వజ్రం దొంగతనం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందని.. నెమలి సింహాసనం నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే అంశం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని ఆయన తెలిపారు.  కొల్లూరు గనుల నుంచి వజ్రం నిజాంకు, ఆ తర్వాత మొఘలుల చేతికి ఎలా చేరిందో కూడా సినిమాలో చూపించనున్నారు.  

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి

కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది.  దాని చరిత్ర సుదీర్ఘమైనది, ఎన్నో చేతులు మారింది. కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం, కొల్లూరు గనులలో లభ్యమైందని చరిత్రకారులు చెబుతున్నారు.  ఆ తర్వాత ఇది మొఘల్ రాజు బాబర్ చేతికి చేరింది.మొఘల్ చక్రవర్తులైన హుమాయూన్, షాజహాన్, ఔరంగజేబు వంటి వారి చేతులు మారుతూ వచ్చింది. షాజహాన్ తన నెమలి సింహాసనంలో దీనిని పొదిగించాడు.  1739లో పర్షియన్ రాజు నాదిర్ షా ఢిల్లీని జయించి, మొఘలుల సంపదను దోచుకెళ్లాడు. అప్పుడే ఈ వజ్రాన్ని చూసి "కోహ్-ఇ-నూర్" (కాంతి పర్వతం) అని పేరు పెట్టాడు. నాదిర్ షా మరణానంతరం, ఈ వజ్రం ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి వెళ్లింది. చివరికి, పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ దీనిని సొంతం చేసుకున్నాడు. 1849లో సిక్కు యుద్ధంలో ఓటమి పాలైన తర్వాత, మహారాజా దలీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ వజ్రం బహుమతిగా ఇవ్వబడింది. అప్పటి నుండి ఇది బ్రిటన్ రాణి విక్టోరియా ఆధీనంలోకి వెళ్ళింది.

ప్రస్తుతం కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలో ఉంది. ఇది క్వీన్ ఎలిజబెత్ ది క్వీన్ మదర్ క్రౌన్‌లో పొదగబడి ఉంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణానంతరం, దీనిపై చర్చ మళ్ళీ మొదలైంది. అయితే, ఇది బ్రిటన్ రాజకుటుంబం యొక్క వారసత్వ సంపదగా కొనసాగుతోంది. కోహినూర్ వజ్రం ఒక అరుదైన, చరిత్ర కలిగిన వజ్రం కావడంతో, దీనికి ఖచ్చితమైన విలువను అంచనా వేయడం కష్టం. దీనిని సాధారణంగా అమూల్యంగా పరిగణిస్తారు. ఇది కేవలం ఒక రాయి కాదు, ఎన్నో చరిత్రలు, కథలు, యుద్ధాలకు సాక్షిగా నిలిచిన ఒక చిహ్నం. దీని బరువు 105.6 క్యారెట్లు (21.12 గ్రాములు). కోహినూర్ వజ్రం తమదేనని భారత్ తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు కూడా వాదిస్తున్నాయి. భారత్ ఈ వజ్రాన్ని తిరిగి తమ దేశానికి తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే, బ్రిటన్ ప్రభుత్వం దీనిని తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తూ వస్తుంది.

Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

Also Read: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత

kohinoor dimand | HHVM | Pawan Kalyan | tollywood | telugu-news

#Pawan Kalyan #telugu-news #tollywood #kohinoor dimand #HHVM
Advertisment
తాజా కథనాలు