/rtv/media/media_files/2025/07/22/150-luxury-cars-stolen-and-enjoyed-for-20-years-2025-07-22-07-19-15.jpg)
150 luxury cars stolen and enjoyed for 20 years..
Crime News: ఒకటి కాదు రెండు కాదు 20 ఏండ్లుగా లగ్జరీ కార్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడడమే కాకుండా సుమారు 150 కార్లను దొంగిలించిన ఘరానా నేరస్తుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై అన్నానగర్‌కు చెందిన యతిరాజ్‌రత్నం ఈ ఏడాది మే నెలలో తన కారు సర్వీసింగ్ కోసం కోయంబేడులోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. సర్వీస్ పూర్తయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంటిముందు నిలిపాడు. అయితే జూన్ 10న ఇంటిముందు ఉండాల్సిన కారు అదృశ్యమైంది. వెంటనే యతిరాజ్‌రత్నం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. కాగా వారికి లభించిన సమాచారంతో కారు చోరీ చేసిన వ్యక్తిని పుదుచ్చేరిలో అరెస్టు చేశారు.
Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
అతన్ని చెన్నై తీసుకొచ్చి విచారించగా పోలీసులు సైతం అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన వ్యక్తి పేరు సత్యేంద్రసింగ్ షెకావత్ అని తేలింది. రాజస్థాన్‌కు చెందిన సత్యేంద్రసింగ్ ఎంబీఏ చదివాడని, తండ్రి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి అని తెలిసింది. సత్యేంద్రసింగ్ చోరీకి ఎంచుకునే విధానం కూడ భిన్నంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కార్ల సర్వీస్ సెంటర్లకు వెళ్లి, తన కారు సర్వీస్‌కు ఇవ్వాలని అక్కడున్న సిబ్బందితో మాటలు కలుపుతాడని తెలిపారు. అనంతరం అక్కడున్న కార్ల గురించి తెలుసుకొని, వాటిలో తను చోరీ చేయాలనుకున్న కారును ఎంచుకుని దానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుతాడు. దాని సాయంతో ఆ కారు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని అక్కడికి వెళ్లి చోరీ చేస్తాడని దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చూడండి:Mumbai Train Blast: వాళ్లంతా నిర్దోషులే.. ముంబయి పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
నిందితుడు లగ్జరీ కార్లను మాత్రమే చోరీ చేసి, వాటిని రాజస్థాన్‌లో విక్రయించేవాడు. అలా తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో గత 20 ఏళ్లుగా 150కి పైగా లగ్జరీ కార్లను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు.20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సత్యేంద్రసింగ్ పోలీసులకు చిక్కడంతో చోరీకి గురైన కార్ల లెక్క తీసేందుకు పోలీసులు నడుం బిగించారు.
ఇది కూడా చూడండి:Tamil Nadu: అత్యాచారానికి గురైన యువతి.. ధైర్యంతో మరో యువతిని కాపాడిన వీర వనిత