/rtv/media/media_library/vi/ZSf3kI2e0mw/hq2.jpg)
Srisailam project
Srisailam project : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 27 గేట్లు ఎత్తారు. దీంతో ఆ వరద నీరు శ్రీశైలానికి చేరుకుంటుంది. మరోవైపు సుంకేసుల నుంచి కూడా వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,03,587 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి చేరుకుంటోంది.
Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుకాగా, ప్రస్తుత నీటినిల్వ 208.7210 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 67,346 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల చేస్తున్నారు.