🔴Live News Updates: ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం.. NDAలో నారీశక్తి నిరూపించిన 17 మంది అమ్మాయిలు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Bengaluru: ఎవడ్రా వీడు.. ముగ్గురు భార్యలు - 9 మంది పిల్లల కోసం ఇలా చేశావేంట్రా!
డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో తీరు. కొందరు ఫ్యామిలీ కోసం కష్టపడి డబ్బులు కూడబెడతారు. ఇంకొందరు ఈజీ మనీకి అలవాటు పడి ఏ పని చేయకుండా దొంగతనాలు చేసి దోచేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి తన ఫ్యామిలీలను పోషించడానికి దొంగగా మారాడు. అతడికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ఫ్యామిలీలు ఉన్నాయి.
అంటే ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యలతో కలిగిన సంతానం దాదాపు 9 మంది. ఇక వారిని పోషించడానికి ఆ వ్యక్తికి తలప్రాణం తోకకు వచ్చినట్లైంది. మొదటిగా కూలి పనులు చేసుకునే వాడు. కానీ ఆ డబ్బులతో తమ మూడు ఫ్యామిలీలను పోషించడం కష్టంగా మారింది. దీంతో తరచూ ఏం చేయాలి? ఏం చేయాలి? అని తెగ ఆలోచించాడు.
చివరికి ఈజీ మనీ సంపాదించే దుర్భుద్ది పుట్టింది. దీంతో దొంగగా మారాడు. పలు చోట్ల బంగారం, వెండి, నగదు.. ఇలా ఏవి దొరికితే అవి కొట్టేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇక నిందితుడి చోరీల వెనుకున్న కారణం తెలిసి పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల బాబా జాన్‌కు ముగ్గురు భార్యలు.. వారితో కలిగిన సంతానం 9 మంది. ఈ మూడు ఫ్యామిలీలను వేరే వేరే చోట ఉంచాడు. బెంగళూరు, చిక్కబళ్లాపుర, శ్రీరంగపట్టణాల్లో పెట్టి పోషించాడు. అది కష్టంగా మారడంతో జాన్ దొంగగా మారాడు. పలు ప్రాంతాల్లో దొంగతనం చేసి చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 188 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇండియా హిస్టరీలో ఫస్ట్ టైం.. NDAలో నారీశక్తి నిరూపించిన 17 మంది అమ్మాయిలు
మహారాష్ట్ర పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ హిస్టరీ క్రియేట్ చేసింది. మొదటిసారిగా 17 మందితో మహిళా క్యాడెట్స్ బ్యాచ్ పాస్‌అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఉమెన్ ఆఫీసర్లు పురుషులతో సమానంగా త్రివిధ దళాల్లో దేశానికి సేవలందించనున్నారు.
May 30, 2025 19:46 IST
కవిత ఇష్యూపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పొంగులేటి కవిత వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదన్నారు. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారని ఆరోపించారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతోందని తెలిపారు.
Kavita and ponguleti Srinivas
May 30, 2025 19:45 IST
ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి సంచలన ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. జూన్ 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు.
Ponguleti Srinivas
May 30, 2025 19:45 IST
అది డాడి డాటర్, అన్నాచెల్లెళ్ల సమస్య: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కవిత ఇష్యూ డాడీడాటర్, అన్నాచెల్లెళ్ల సమస్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అది పార్టీ లేదా ఫ్యామిలి అంతర్గత విషయమన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
May 30, 2025 19:43 IST
2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం.. చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 2047 వికసిత్ భారత్ సాధిస్తామన్నారు.
Chandra babu Naidu
May 30, 2025 18:46 IST
ఏపీలో రెండేళ్ల హత్య కేసును ఛేదించిన పోలీసులు
అనకాపల్లి జిల్లా యలమంచిలిలో రెండేళ్ల క్రితం యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతిని హత్య చేసిన కేసులో యలమంచిలి పట్టణానికి చెందిన రవితేజ, ఎస్ సాయి కృష్ణ, బంగారి శివ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి విష్ణు స్వరూప్ తెలిపారు.
anakapalli crime news
May 30, 2025 18:45 IST
పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్ ఆయన శుక్రవారం సందర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్‌ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.
May 30, 2025 17:50 IST
పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయని అమిత్ షా అన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Home Minister Amit Shah
May 30, 2025 16:20 IST
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని మోదీ
బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ పాట్నా విమానాశ్రయంలో 14ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని కలిశారు. వైభవ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన X అకౌంట్‌లో పోస్టు చేశారు. వైభవ్ IPLలో 35 బంతుల్లో సెంచరీ కొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే.
May 30, 2025 16:19 IST
నాన్న హీరో, అన్న విలన్.. కవిత, షర్మిల మధ్య పోలికలివే !
కవిత, షర్మిల మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి భర్తల పేర్లు అనిల్, ఇద్దరూ అన్నలపై ఆరోపణలు చేశారు. ఇద్దరూ అన్నతో కలిసి పార్టీ కోసం పని చేశారు. తర్వాత సొంత గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కవిత లేఖతో BRS పరిణామాలు ఆసక్తిగా మారాయి.
May 30, 2025 15:51 IST
నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Supreme Court
May 30, 2025 15:13 IST
ఏపీలోనూ సినిమా అవార్డులు ప్రకటించాలి.. మురళి మోహన్ కీలక వ్యాఖ్యలు
ఈరోజు జరిగిన గద్దర్ అవార్డ్స్ మీడియా సమావేశంలో జ్యురీ సభ్యులు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ సినీ అవార్డులను ప్రకటించాలని అన్నారు. ఒక ఏడాది తెలంగాణ, మరో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించాలని సూచించారు.
Murali Mohan on gaddar awards
May 30, 2025 15:12 IST
హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడి ప్రాణం తీసిన డబ్బులు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో సాయికార్తీక్ అనే యువకుడి సిద్ధార్థరెడ్డి వద్ద రూ. 8 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మద్యం మత్తులో సిద్ధార్థరెడ్డి సాయికార్తీక్‌ను కొట్టి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
hyd crime news
May 30, 2025 15:11 IST
నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Supreme Court
May 30, 2025 15:11 IST
ఆర్సీబీ ఫైనల్‌లో ఓడితే భార్యకు విడాకులు.. ఫ్యాన్స్ డిమాండ్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ఫైనల్‌లో గెలవకపోతే భర్తకు విడాకులు ఇస్తానని ఓ మహిళా పట్టుకున్న బ్యానర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఇదేక్కడి వింత ప్రేమ అని కామెంట్లు చేస్తున్నారు.
RCB Final
May 30, 2025 15:10 IST
వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
సిక్కింలో గురువారం రాత్రి పర్యటకుల వ్యాన్ తీస్తా నదిలో పడిపోయింది. దీంతో స్పాట్‌లోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మిగిలిన తొమ్మిది మంది నదిలో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు.
May 30, 2025 15:09 IST
తగ్గనంటున్న హమాస్.. కాల్పుల విరమణకు నో
అమెరికా హమాస్‌కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పాడు.
Hamas official says it will reject new US Gaza ceasefire plan backed by Israel
May 30, 2025 15:09 IST
ఏపీలో మరో లవ్‌స్టోరీ.. ప్రేమ విఫలమైందని బాలిక ఆత్మహత్యాయత్నం
ఏలూరు జిల్లా బాపురాజుగూడెంకి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్పందించిన తండ్రి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్‌ను సందర్శించిన నేపథ్యంలో అతడ్ని అరెస్టు చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిదూర్’ సమయంలో సన్నీ పాక్‌లోనే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సన్నీ అసలు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
May 30, 2025 13:16 IST
YASH: 'రామాయణం'లో హాలీవుడ్ యాక్షన్ ఫీస్ట్.. యష్ ఫొటోలు వైరల్ !
'KGF' హీరో యష్ 'రామాయణం' చిత్రం కోసం భారీ యాక్షన్ సీన్లపై పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నొరిస్ డిజైన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
yash in Ramayana
May 30, 2025 13:15 IST
Crime News: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా.. భర్త ప్రైవేట్ పార్ట్ కొసేసిన భార్య.. కారణం తెలిస్తే షాకే!
యూపీలోని సంభాల్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవకు బావమరిది కారణమయ్యాడు. దీంతో భర్త ప్రైవేట్ పార్ట్‌ను భార్య కత్తితో కట్ చేసేసింది. అనంతరం అతడి నాలుకను నోటితో కొరికేసింది. కేకలు విన్న పొరుగువారు అతడిని హాస్పిటల్‌లో చేర్చారు.
UP Sambhal Wife Cut Husband Private part
May 30, 2025 13:15 IST
Virat Kohli: యువ ఆటగాడిని కోహ్లీ స్లెడ్జింగ్..సోషల్ మీడియాలో విమర్శలు
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తున్నారు. సీనియర్ అయి ఉండి యువ ఆటగాళ్ళను ప్రోత్సహించకుండా స్లెడ్జింగ్ చేశాడంటూ తిడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో నీళ్ళందిస్తాడు అంటూ ముషీర్ ఖాన్ ను అనడంపై వివాదం చెలరేగుతోంది.
Virat Kohli Sledging
May 30, 2025 11:27 IST
PM Modi Death Threat: ‘ప్రధాని మోదీని చంపేస్తా!’
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మోదీని చంపేస్తానని 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు బెదిరించిన వ్యక్తిని భాగల్పూర్‌లో అరెస్టు చేశారు.
PM Modi Death Threat Photograph: (PM Modi Death Threat)
May 30, 2025 11:27 IST
AP - TG Heavy Rain Alert: వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జూన్ 2వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Heavy rains in Telangana.
May 30, 2025 11:26 IST
Vivo S30 and S30 Pro Mini: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్‌ఫోన్లు అదిరిపోయాయ్!
Vivo S30 and S30 Pro Mini స్మార్ట్‌ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తాయి. Vivo S30 స్నాప్‌డ్రాగన్ 7జెన్ 4 SoCపై, Vivo S30 pro mini మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌పై నడుస్తాయి.
Vivo S30 and S30 Pro Mini Photograph: (Vivo S30 and S30 Pro Mini)
May 30, 2025 11:26 IST
HYD Crime News: హైదరాబాద్‌లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్‌లో కారు పార్కింగ్ విషయమై జరిగిన ఘర్షణలో ఖమ్మం జిల్లా వాసి నాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చైతన్యపురిలోని కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్‌లో జరిగింది.
May 30, 2025 11:25 IST
Kamal Haasan Controversy: కమల్ హాసన్‌కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడలో తీవ్ర దుమారం రేపాయి. దీని కారణంగా ‘థగ్ లైఫ్’ మూవీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టిలోగా అతడు కమల్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని KFCC తెలిపింది.
Kamal Haasan Thug Life movie will stop in karnataka Photograph: (Kamal Haasan Thug Life movie will stop in karnataka)
May 30, 2025 11:25 IST
Heavy Rains: అయ్యో ఘోరం.. భారీ వర్షాలకు 16 మంది మృతి
మహారాష్ట్రలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 16 మంది మరణించారు. కొండచరియలు విరిగిపోవడం, పిడుగులు, చెట్లు నేలకూలడం వంటి సంఘటనలతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 18 మంది గాయపడ్డారు. 41 జంతువులు మరణించాయని వాతారణ శాఖ తెలిపింది.
May 30, 2025 11:24 IST
Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
పాకిస్తాన్ మరో పుల్వామా అటాక్ కు రెడీ అవుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న ర్యాలీలే ఇందుకు నిదర్శనం. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా పాల్గొనడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది.
Terrorist Hafeez Sayed
May 30, 2025 11:24 IST
Stock Market: నిన్న చివర్లో తేరుకున్న సూచీలు ఇవాళ మళ్ళీ నష్టాల్లోకి..
అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.
ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర జవాన్లు, నారీమణుల గురించి బోలెడు కథనాలు ఇప్పటి వరకు వచ్చాయి. కానీ ఈ మొత్తం యుద్ధంలో పాల్గొన్న పదేళ్ల పిల్లాడి గురించి మీకు తెలుసా. భారత సైన్యం సైతం శాల్యూట్ చేసిన బాలుడు ఎవరో కింది ఆర్టికల్ లో చూద్దాం రండి..
Sravan Singh
May 30, 2025 10:17 IST
USA: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు పట్టువిడవటం లేదు. ఒక కోర్టు కాకపోతే మరోటి అంటున్నారు. నిన్న సుంకాలను నిలిపేయాలని యూఎస్ ట్రేడ్ కోర్ట్ ఆదేశాలిస్తే.. ఈ రోజు మరో కోర్టు దగ్గర నుంచి అనుమతిని తెచ్చుకున్నారు.
తమకు, ఉగ్రవాదానికి ఏం సంబంధం లేదంటూ పాకిస్తాన్ బుకాయిస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆ దేశమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందనే ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. తాజాగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ మంత్రులూ కలిసి ఒకే వేదికను పంచుకున్న ఫోటో ఒకటి బయటపడింది.
Terrorists, and pak minister
May 30, 2025 10:13 IST
UNO layoffs: ట్రంప్ దెబ్బ.. ఐక్యరాజ్యసమితిలో భారీ లేఆఫ్స్!
ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది.
May 30, 2025 10:12 IST
Qualifier 1: ఆర్సీబీ భారీ గెలుపు.. క్వాలిఫయర్ 1 వివరాలివే..
నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 లో పంజాబ్ మీద బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ గెలుపు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా మ్యాచ్ గెలిచింది.
RCB
May 30, 2025 06:53 IST
Jyothi: ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో తెలుగు అథ్లెట్ కు గోల్డ్
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉమెన్స్ 100 మీ హర్డిల్స్ లో తెలుగు అమ్మాయా జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్ వచ్చింది. 12.96 సెకన్లలో జ్యోతి లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.
Jyothi Yarraji
May 30, 2025 06:53 IST
Today Gold Rates: ఈవాళ బంగారం ధరలు తగ్గాయ్.. ఎక్కడంటే?
ఇవాళ బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్‌రేట్ రూ.97,030, 22 క్యారెట్ల 10గ్రా ధర రూ. 88,940గా ఉంది. విజయవాడ, విశాఖ పట్టణంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. అయితే నిన్న కాస్త ఎక్కవగా ఉన్నాయి.
gold rates today monday
May 30, 2025 06:51 IST
RCB : ఐపీఎల్ హిస్టరీ రిపీట్ అయితే.. ఈ సాలా కప్ నమ్దే
తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం చూస్తే క్వాలిఫయర్స్ లో మ్యాచ్ గెలిచిన వాళ్ళే ఫైనల్స్ లో కప్ గెలుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్.