/rtv/media/media_files/2025/05/30/VYQPfLP7i9YBxbaj22l3.jpg)
Hamas official says it will reject new US Gaza ceasefire plan backed by Israel
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికా హమాస్‌కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పాడు. దీనికిముందు అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో జరిపిన చర్చల్లో చేసిన ప్రతిపాదనలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. విట్కాఫ్ ఇటీవల కాల్పుల విరమణ ప్రతిపాదనను తీసుకొచ్చారు.
Also Read: 'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్‌లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Gaza Ceasefire Plan
దీని ప్రకారం హమాస్ సజీవంగా ఉన్న 10 మంది బందీలను, 18 మంది మ-ృతదేహాలను అప్పగించాలి. రెండు దశల్లో ఇది జరగాల్సి ఉంటుంది. దీనికోసం ఇజ్రాయెల్ 60 రోజుల పాటు కాల్పుల విరమణను అనుసరించాలి.. అలాగే తమ బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను అప్పగించాలి. హమాస్ వద్ద ప్రస్తుతం 58 మంది బందీలు ఉన్నారు. వాళ్లలో కనీసం 20 మంది వరకు సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ నమ్ముతోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. ప్రధానమంత్రి నెతన్యాహూ బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ.. తాను ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని మాత్రం తెలిపారు.
Also Read: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
మార్చి 18 నుంచి ఇజ్రాయెల్ గాజాపై ఎదురుదాడులు చేస్తూనే ఉంది. అప్పటిదాకా అమెరికా, ఖతార్, ఈజిప్ట్ సంయక్తంగా కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారిపోయింది. అలాగే మే 19 నుంచి ఇజ్రాయెల్ దళాలు మరింత విస్తృతంగా ఆపరేషన్ చేపట్టాయి. గాజాను పూర్తిగా తమ అధినంలోకి తీసుకంటామని అప్పట్లో నెతన్యాహూ కూడా తెలిపారు. గత 10 వారాల్లో దాదాపు 4 వేల మంది ప్రజలు గాజాలో మరణించినట్లు తెలుస్తోంది. అలాగే ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 22 కొత్త యూదుల ఆవాసాలు ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: భారతీయ జంట పెండ్లి బరాత్‌తో ఊగిపోయిన వాల్‌స్ట్రీట్
Also Read : వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
telugu-news | hamas | israel | rtv-news