/rtv/media/media_files/2025/05/29/4bo2c66bGnjyVmScz7bN.jpg)
RCB
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ గెలవలేదు. ఫైనల్స్ వరకు వెళ్ళినా కప్ ను మాత్రం సాధించలేకపోయింది. ఇప్పుడు తొమ్మిది ఏళ్ళ తర్వాత ఆర్సీబీ మొదటిసారి ఫైనల్స్ లోకి వెళ్ళింది. అది కూడా సూపర్ విక్టరీతో. ఐపీఎల్ నాకైట్ చరిత్రలో నిన్న జరిగిన మ్యాచ్ ఒక రికార్డ్. బంతుల పరంగా అత్యంత భారీ గెలుపు ఇది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 101 పరుగులకే ఆలౌట్ అయింది. దీనిని బెంగళూరు కేవలం పది ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించేసింది. దీంతో పాటూ మరిన్న ివిశేషాలు ఈ మ్యాచ్ లో నమోదయ్యాయి.
మొదటి క్వాలిఫయర్ విశేషాలు..
ఐపీఎల్ 18 సీజన్లలో అత్యంత వేగంగా 100+ టార్గెట్ ను ఛేజ్ చేయడం ఇది మూడవసారి. ఆర్సీబీ 10 ఓవర్లలో పంజాబ్ పై గెలిచింది. అంతకుముందు 2015లో కేకేఆర్‌పై ఆర్సీబీనే 9.4 ఓవర్లలోనే 112 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.
ఆర్సబీ నాలుగోసారి ఫైనల్స్ కు చేరింది. 2009, 2011, 2016, ఇప్పుడు ఫైనల్స్ కు వెళ్ళింది. కానీ ఒక్కసారి కూడా కప్ గెలవలేదు.
ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఫైనల్స్ కు వెళ్ళిన జట్టే ఇప్పటి వరకు కప్ ను గెలుచుకుంది. 2011లో ప్లేఆఫ్స్ పద్ధతి ప్రారంభం తర్వాత నుంచి 14 ఎడిషన్లలో 11 సార్లు క్వాలిఫయర్ -1 గెలిచిన జట్టే ఛాంపియన్ అయింది.
బంతుల పరంగా నాకౌట్ లో ఆర్సీబీ భారీ విజయం సాధించింది. పంజాబ్ పై 60 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అంతకు ముందు 2024 సీజన్ లో సన్ రైజర్స్ మీద కోలకత్తా 57 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది.
ఈ సీజన్ లో ఇప్పటి వరకు తొమ్మది మంది ఆర్సీబీ ఆటగాళ్ళఉ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నారు. నిన్న మ్యాచ్ లో సుయాశ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా పూర్తయిన మ్యాచ్ ఇదే. మొత్తం 24.1 ఓవర్లలోనే ముగిసింది.
today-latest-news-in-telugu | IPL 2025 | rcb | match