/rtv/media/media_files/2025/05/29/ibm9ZFM13sTpKKsDbpNM.jpg)
EE sala Cup namde, RCB
ఈసారి ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ బలంగా ఉండి ప్రత్యర్థుల భరతం పడుతోంది. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటి వరకు బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయింది. అసలు తొమ్మిదేళ్ల క్రితం ఫైనల్స్ కు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు చేరుకుంది. ఈసారి ఆర్సీబీ అన్ని రకాలుగా బలంగా ఉంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన టైమ్ లో ఫామ్ లోకి వచ్చాడు. గత ఐదు మ్యాచ్ లలో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు పవర్ ప్లేలో ఓపెనర్ సాల్ట్ ఇరగదీస్తున్నాడు. దానికి తోడు జట్టులోకి డీ విలియర్స్ వచ్చి చేరుతాడని తెలుస్తోంది. ఇక మిడిలార్డర్ లో జితేశ్ శర్మ చితక్కొడుతున్నాడు. మధ్యలో గాయలు జట్టును ఇబ్బంది పెట్టినా ఇప్పుడు అందరూ సెట్ అయ్యారు. హేజిల్‌వుడ్.. భువనేశ్వర్, యశ్ దయాళ్, షెపర్డ్‌లతో పేస్ బాధ్యతలు పంచుకుంటారు. కృనాల్, సుయశ్ స్పిన్ చేస్తారు. ఇప్పుడు పంజాబ్ మీద బెంగళూరు అద్భుతంగా గెలిచింది. దీంతో ఆ జట్టుకు సూపర్ పవర్ వచ్చినట్టు అయింది. ఇదే జోష్ తో బెంగళూరు జట్టు ఆడితే ఈ సాలా కప్ నమ్దే కచ్చితంగా.
𝐓𝐇𝐄 𝐅𝐈𝐍𝐀𝐋 𝐂𝐀𝐋𝐋𝐈𝐍𝐆. 🏆
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
Through grit, grind, and some glorious cricket, we’re into the big one! pic.twitter.com/HkidnNOJIY
ಇದು ನಮ್ಮ ಅಭಿಮಾನಿ ದೇವ್ರುಗಳಿಗೆ! 🙏 pic.twitter.com/NxOBwNil2Q
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 29, 2025
ఐపీఎల్ చరిత్ర..
మరోవైపు ఐపీఎల్ చరిత్ర కూడా ఆర్సీబీ ఫైనల్స్ విన్నింగ్ కే మొగ్గు చూపుతోంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు క్వాలిఫయర్స్ లో విజయం సాధించి ఫైనల్స్ లోకి ఎంటర్ అయిన వారే..కప్ ను కూడా గెలుచుకున్నారు. దాని ప్రకారం చూస్తే ఈసారి కప్ ఆర్సీబీకే వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఈరోజు మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న బెంగళూరు ఫ్యాన్...ఐపీఎల్ హిస్టరీని చూపించి మరింత సంతోషంతో గెంతులు వేస్తున్నారు. కప్ నమ్దే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
One Step Away from Glory! Congratulations to RCB on scintillating display. The trio of Yash Dayal, Bhuveaneswar Kumar and Hazelwood was unplayable. Aur @imvkohli kya kehne. Mind blowing energy #RCBvsPBKS @RCBTweets pic.twitter.com/OGum7D8Oqo
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 29, 2025
🚨 1 WIN AWAY from creating HISTORY 🏆
— 𝗗𝗶𝘀𝗵𝗮... (@_sinha_disha) May 29, 2025
RCB is into the FINAL after 9 long years! 🎉🎉
The dream is alive. The fire is real. ❤️
Congratulations RCB.
Let’s finish what we started 💪#RCBvsPBKS #PBKSvRCB #EeSalaCupNamde pic.twitter.com/T0XPnf8ZXg
🏆 IPL 2025 Champions: Royal Challengers Bangalore
— Reenu yadav (@reenu26451) May 29, 2025
Ee Sala Cup Namde! 🔴⚫
Qualifier 1: PBKS vs RCB – ✅
Eliminator: MI vs GT – ✅
Qualifier 2: MI vs PBKS – ✅
Final: PBKS vs RCB – RCB Wins! 🥳
Finally, the wait is over. The cup is ours!
Let’s go, RCB! 💪#IPLPlayoffs#RCBvsPBKS pic.twitter.com/iGj9FgWVvc
today-latest-news-in-telugu | finals