/rtv/media/media_files/2025/05/30/9jaTd6xHNiRdwriRsLS9.jpg)
Home Minister Amit Shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయన్నారు. వాళ్ల సమాచారం, నిఘా నెట్‌వర్క్‌లను కూల్చివేశాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. BSF కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు.
Also Read: 'ఆపరేషన్ సిందూర్' టైంలో సన్నీ యాదవ్ పాక్‌లో ఏం చేశాడు?.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
Amit Shah Comments On Pakistan
'' ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాక్ సైన్యం సరిహద్దులో మన దేశ పౌరులపై దాడులు చేసింది. కానీ మన BSF బలగాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి. దాదాపుగా 118 పాక్ పోస్టులను ధ్వంసం చేశాయి. వాళ్ల నిఘా వ్యవస్థను కూల్చేశాయి. వాటిని పునరుద్ధరించేందుకు శత్రు దేశానికి నాలుగైదేళ్లు పడుతుందని'' అమిత్ షా అన్నారు. అలాగే కొంతకాలం పాటు పూర్తి సమాచారం లేకుండా యుద్ధం చేసే పరిస్థితులో వాళ్లు లేరని తెలిపారు.
जम्मू-कश्मीर के पुंछ में BSF के वीर जवानों से संवाद कर रहा हूँ। https://t.co/SqDkpjpC2T
— Amit Shah (@AmitShah) May 30, 2025
Also Read: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా.. భర్త ప్రైవేట్ పార్ట్ కొసేసిన భార్య.. కారణం తెలిస్తే షాకే!
అలాగే సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూ వ్యూహాలను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశారని బీఎస్‌ఎస్ జవాన్లను ప్రశంసించారు. భారత సరిహద్దుల్లో ఎలాంటి దాడి జరిగిన మొదటగా ఈ భారం మోసేది బీఎస్‌ఎఫ్ జవాన్లేనని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా పాక్ జరిపిన దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను అమిత్ షా పరామర్శించారు. పాక్ దాడుల వల్ల దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని తెలిపారు.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
#OperationSindoor में आतंकी अड्डों पर हुए हमलों से बौखलाए पाकिस्तान ने जम्मू-कश्मीर के रिहायशी इलाकों, गुरुद्वारों और मंदिरों को निशाना बनाकर गोलीबारी की।
— Amit Shah (@AmitShah) May 30, 2025
इन कायराना कृत्यों में जिन लोगों ने अपने परिजनों को खोया, आज उनसे मिलकर संवेदनाएं प्रकट कीं और उन्हें नियुक्ति पत्र सौंपे।… pic.twitter.com/ybm28WyhxZ
Also Read: ఇంత వైలెంట్‌గా ఉన్నారేంట్రా.. భర్త ప్రైవేట్ పార్ట్ కొసేసిన భార్య.. కారణం తెలిస్తే షాకే!
operation Sindoor | Pahalgam attack | telugu-news | national-news