YASH: కేజీఎఫ్ యష్ (yash) రావణుడిగా, రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ' రామాయణ'(Ramayana) చిత్రీకరణలో బిజీగా ఉంది. ప్రస్తుతం యష్ కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్లను షూట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'రామాయణ' కోసం యష్ భారీ యాక్షన్ సీన్ల పై పనిచేస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/30/Jg9bv2zbzAzXiFJSUmjR.png)
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
భారీ యాక్షన్ సీన్స్
సినిమాకు సంబంధించిన పూర్తి యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నొరిస్ డిజైన్ చేస్తున్నారు. ఆయన 'మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్', 'ది స్యూసైడ్ స్క్వాడ్' లాంటి హిట్ సినిమాలకు స్టంట్స్ కంపోజ్ చేశారు. ఈ సీన్లు యష్ పాత్రను ప్రధానంగా తీసుకొని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే యాక్షన్, వీఎఫ్ఎక్స్ టీమ్‌తో దగ్గరగా పనిచేస్తూ సన్నివేశాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.
Just look at the aura and presence of #Yash - he’s born to play #Raavan!🔥#RanbirKapoor as Shri Ram vs Yash as Raavan , this epic clash could rewrite box office history!#Ramayana Part 1 & 2 coming this Diwali 2026 & 2027 !! pic.twitter.com/F4pTR7A67y
— Sumit Kadel (@SumitkadeI) May 29, 2025
భారీ బడ్జెట్ తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌పై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి (సీత), సన్నీ డియోల్ (హనుమాన్), రవి దుబే (లక్ష్మణుడు), కాజల్ అగర్వాల్ (మందోదరి), లారా దత్తా (కైకేయి) పాత్రల్లో చేస్తున్నారు. 'రామాయణ' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. 'రామాయణం పార్ట్ 1' 2026 దీపావళికి, పార్ట్ 2 2027 దీపావళికి రిలీజ్ అవుతుంది. వీఎఫ్ఎక్స్ వర్క్‌ను ఆస్కార్ విజేత స్టూడియో DNEG చేస్తోంది.
Also Read: 2014- 2023 గద్దర్ అవార్డ్స్.. ఉత్తమ చిత్రాలుగా RRR, అఖండ, జెర్సీ, కలర్ ఫొటో