Kamal Haasan Controversy: కమల్ హాసన్‌కు బిగ్ షాక్.. ‘థగ్‌ లైఫ్‌’ మూవీ బ్యాన్..!

కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడలో తీవ్ర దుమారం రేపాయి. దీని కారణంగా ‘థగ్ లైఫ్’ మూవీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టిలోగా అతడు కమల్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని KFCC తెలిపింది.

New Update
Kamal Haasan Thug Life movie will stop in karnataka

Kamal Haasan Thug Life movie will stop in karnataka

కమల్ హాసన్ ‘థగ్‌ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ కానుండగా.. తమ రాష్ట్రంలో ‘థగ్ లైఫ్’ను విడుదల కానివ్వం అని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) హెచ్చరించింది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగానే తాజాగా కేఫ్‌‌సీసీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?

క్షమాపణలు చెప్పకపోతే

ఇవాళ్టీ లోగా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పలేదంటే.. అతడు నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌ను తమ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. ఇదే విషయాన్ని కమల్ హాసన్‌తో కలిసి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు KFCC స్పందిస్తూ..  కమల్ హాసన్ సినిమాను నిషేందించాలని రాష్ట్రంలోని పలు గ్రూప్‌లు డిమాండ్ చేస్తున్నాయని.. దీనిపై భాగస్వామ్య పక్షాలతో సమావేశమయ్యామని తెలిపింది. ఇందులో కమల్ తప్పుచేశారని ఒక అభిప్రాయానికి వచ్చి.. అతడు క్షమాపణలు చెప్పాల్సిందేనని నిర్ణయానికి వచ్చామని పేర్కొంది. ఇదే విషయంపై కమల్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ఇందులో భాగంగా కేఎఫ్‌సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు మాట్లాడుతూ.. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయన నటిస్తున్న సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు. ఆయనపై ఎలాంటి సానుభూతి లేదని.. క్షమాపణలు చెప్పని తరుణంలో కన్నడ సంఘాలతో కలిసి తామంతా నిరసన చేస్తామని తెలిపారు. 

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

కమల్ కాంట్రవర్సీ కామెంట్స్ 

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. ఇటీవలే చెన్నై లో తన రాబోయే సినిమా  'తగ్ లైఫ్' ఆడియో రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..  "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని అన్నారు. దీంతో వివాదం చెలరేగింది. కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు కమల్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు