/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
నిన్న యూఎస్ ట్రేడ్ కోర్డు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను నిలిపేయాలని ఆర్డర్లు ఇచ్చింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం ట్రేడ్ కోర్టుకన్నా హై కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. ఇందులో అమెరికా ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ట్రంప్ కు అనుగుణంగా తీర్పును ఇచ్చింది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని తెలిపింది.
ఫెడరల్ కోర్ట్ షాక్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ ఫెడరల్ కోర్టు షాకి ఇచ్చింది. సుంకాలను అమలు చేయకూడదని ఆర్డర్లు పాస్ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని అభ్యర్థనలను చేసినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ అధికారాలను ఒప్పుకోవాలని ఎంత చెప్పినా వినలేదు. ప్రస్తుతం సుంకాల విషయంలో అమెరికా ప్రభుత్వంతో చాలా దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇదే విషయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానంలో చెప్పింది. టారీఫ్ డీల్స్ ను ఖరారు చేసుకునేందుకు జూలై 7 వరకు టైమ్ ఉందని చెప్పినా ఫెడరల్ కోర్టు వినలేదు. కనీసం గడువు వరకు అయినా దీన్ని సున్నితాంశంగా పరిగణించాలని చెప్పినా కోర్టు అంగీకరించలేదు.
today-latest-news-in-telugu | usa | donald trump tariffs | us-court
Also Read: Pakistan: ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి..ఒకే వేదికపై ఉగ్రవాదులు, పాక్ మంత్రులు