UNO layoffs: ట్రంప్ దెబ్బ.. ఐక్యరాజ్యసమితిలో భారీ లేఆఫ్స్!

ట్రంప్ దెబ్బకు ఐక్యరాజ్యసమితి కూడా కుదేలయిపోయింది. ఆ సంస్థకు నిధులు కట్ చేయడంతో యూఎన్ 6,900 మందిని లేఆఫ్స్ చేయనుంది. దీంతో 3.7 బిలియన్ల డాలర్ల బడ్జెట్ ను తగ్గించనుంది. 

New Update
ఐరాస వేదికపై ప్రసంగించనున్న ఏపీ విద్యార్థినులు....!

అమెరికా ఫస్ట్ అంటూ అధ్యక్షుడు ట్రంప్ మొత్తం అన్నీ మార్చేస్తున్నారు.  అమెరికాలోనే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నిధులను కట్ చేశారు. ప్రతీకార సుంకాలు అంటూ అందరి దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేయడానికి రెడీ అయ్యారు. తమ దేశం నుంచి నిధులు వెళ్ళే వాటిన్నంటికీ చాలా మొత్తం తగ్గించేశారు. ఇందులో ఐక్య రాజ్య సమితి కూడా ఉంది. ఈ సంస్థకు 1.5 బిలియన్ డాలర్లను కట్ చేశారు ట్రంప్. ఈ దెబ్బకు యూఎన్ విలవిలలాడుతోంది. ఉన్న డబ్బులతో రన్ చేయలేక సతమతమౌతోంది. అందుకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది యూఎన్. 

భారీగా లే ఆఫ్స్..

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఇందులో కూడా అమెరికానే ఫ్స్ట్ ఉంది. యూఎస్ లో పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసిపారేస్తున్నాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వంతు. ట్రంప్ నిధులు కట్ చేయడంలో యూఎన్ కూడా లే ఆఫ్స్ చేయక తప్పడం లేదు అంటోంది. ట్రంప్ యూఎన్ కు 1.5 బిలియన్ డాలర్ల నిధులను కట్ చేశారు. దీంతో ఆ సంస్థ బడ్జెట్ ను తగ్గించుకోవాల్సి వచ్చింది. అందుకోసం భారీగా లేఆఫ్స్ చేస్తోంది. జూన్ 13 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 6,900 మంది ఉద్యోగులను తీసేస్తోంది ఐక్యరాజ్య సమితి. దీని ద్వారా 3.7 బిలియన్ డాలర్లను తగ్గించనుంది.  

అయితే యూఎన్ లే ఆఫ్స్ చేయడం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. 21వ శతాబ్దంలో పౌరులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలంటే యూఎన్ సహకారం ఎంతో అవసరం అని..కానీ యూఎన్ ఇలా ఉద్యోగులను తీసే్తుంటే ఎలా అని అడుగుతున్నారు కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్. 

today-latest-news-in-telugu | un | lay-offs | trump

Also Read: Qualifier 1: ఆర్సీబీ భారీ గెలుపు.. క్వాలిఫయర్ 1 వివరాలివే..

Advertisment
Advertisment
తాజా కథనాలు