PM Modi Death Threat: ‘ప్రధాని మోదీని చంపేస్తా!’

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మోదీని చంపేస్తానని 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు బెదిరించిన వ్యక్తిని భాగల్పూర్‌లో అరెస్టు చేశారు.

New Update
PM Modi Death Threat

PM Modi Death Threat Photograph: (PM Modi Death Threat)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మోదీని చంపేస్తానని 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరంచాడు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు బెదిరించిన వ్యక్తిని భాగల్పూర్‌లో అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని SSP కార్యాలయం గురువారం వెల్లడించింది. 

Also Read: హైదరాబాద్‌లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!

మోదీని చంపేస్తా

ప్రధానమంత్రి బీహార్ పర్యటన సందర్భంగా ఆయనను చంపేస్తామని బెదిరింపు సమాచారం అందిందని SSP కార్యాలయం పేర్కొంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి భాగల్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీని తరువాత సాంకేతిక ఆధారాల ఆధారంగా బృందం ఆ వ్యక్తిని అరెస్టు చేసిందని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్‌ఫోన్లు అదిరిపోయాయ్!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల బీహార్ పర్యటనలో ఉన్నారు. గురువారం (మే 29)న పాట్నా చేరుకున్నారు. అక్కడ ఆయన రోడ్ షో చేశారు. అనంతరం ఇవాళ (మే 30) రోహ్తాస్‌లోని బిక్రమ్‌గంజ్‌లో ఒక ప్రోగ్రామ్‌కు హాజరుకానున్నారు. ఈ తరుణంలో మోదీని చంపేస్తానంటూ 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బెదిరింపులకు పాల్పిడిన వ్యక్తిని అరెస్టు చేశారు. 

Also Read: కమల్ హాసన్‌కు బిగ్ షాక్.. ‘థగ్‌ లైఫ్‌’ మూవీ బ్యాన్..!

పోలీసుల ప్రకారం.. నిందితుడు మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదని అన్నారు. అతడు కీప్యాడ్‌ మొబైల్ ఫోన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు VPN ఉపయోగించి వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డానని అంగీకరించాడు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి, మరొక వ్యక్తికి మధ్య ఉన్న భూ వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఉపయోగించిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు