Chandra Babu Naidu: 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 2047 వికసిత్ భారత్ సాధిస్తామన్నారు.

New Update
Chandra babu Naidu

Chandra babu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 2047 వికసిత్ భారత్ సాధిస్తామన్నారు.  ''ఏ నాయకుడు చూడని ఎత్తుపల్లాలను చూశాను. నేను నా జీవితాన్ని ప్రారంభించినప్పుడు రోడ్లు లేవు, కరెంట్ లేదు. కొన్ని గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కరెంట్ ఉండేది. దేశ అభివృద్ధి కోసం నేను కృషి చేశాను. సమయం కన్నా ముందుగానే ఎల్లప్పుడూ ఆలోచించేవాడిని. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాక నేను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాను. ఆ సమయంలో నాకు వాజ్‌పయ్‌ ప్రభుత్వం మద్దతు ఉండేది. ఆ సమయంలో నేను రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాను. నేను చెప్పే విషయాలు వాజ్‌పాయ్‌ వినేవారు.

Also Read: పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

Chandra Babu Naidu Key Commets On Nation building

 మన దేశంలో BSNL, VSNL రెండు ప్రభుత్వ సంస్థలు ఉండగా.. అందులో BSNLతో దేశీయంగా, VSNLతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్‌ కాల్స్‌ చేసుకునే అవకాశం ఉండేది. అప్పుడు నేను చైనాను గమనించేవాడిని. ఆ సమయంలో వారు సెల్‌ఫోన్లు తీసుకొచ్చారు. అప్పుడు చైనా పట్ల నాకు అసూయగా ఉండేది. వాళ్లు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని అనుకున్నాను. ఈ విషయాన్ని వాజ్‌పేయ్‌కు చెప్తే డబ్బులు ఎలా అని అడిగారు. దీనికి సంబంధించిన ఓ రిపోర్టు తయారు చేసి ఇస్తే.. దాన్ని ఆయన అమలు చేశారు. అప్పట్లో గురుగ్రామ్, పూణె, బెంగళూరు, చెన్నైలో ఉండేవాళ్లు మాత్రమే ఐటీలో వర్క్ చేసేవారు. నేను సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ మొదలైంది. ఒపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల నిర్మాణం వెనుక నా ఐడియానే ఉంది. నమ్మదగిన ప్రజా విధానం సమాజంలో మార్పును తీసుకొస్తుంది. 

Also Read: పాకిస్థాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

నేను కింగ్‌ మేకర్‌ని కాదు. దేశ అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ప్రధాని మోదీ మన దేశాన్ని గర్వించేలా చేశారు. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం 10వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాం. ఇది ఒక గొప్ప విజయం.భారత్‌ ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉంది. దేశం కోసం సరైన సమయంలో సరైన వ్యక్తి (మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడని నేను తరచుగా చెబుతుంటాను. ఇది మన అదృష్టం. పటిష్టమైన ప్రభుత్వంతో పురోగతితో ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్‌ విజన్‌ను తీసుకొచ్చారు. మనం ఇది సాధిస్తామనే నమ్మకం ఉంది. నేను సీఎం అయ్యాక ప్రధాని మోదీ సీఎం అయ్యారు. ఏ నాయకుడు కూడా టెక్నాలజీని, సంస్కరణలను సరిగ్గా అర్థం చేసుకోలేడు. కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యాక దేశ గతిని మార్చారు.

గతంలో ఉన్న ప్రధానమంత్రులు సంస్కరణలు అంటేనే భయపడేవారు. దీనికి అధిక ఖర్చులు అవుతాయని భావించేవారు. అప్పట్లో టెక్నాలజీ గురించి ఎవరికీ అర్థం అయ్యేది కాదు. నేను ప్రపంచ దేశాలు తిరుగుతూ దీని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో ఇండియా సర్వీస్ సెక్టార్‌లో గ్లోబల్‌ హబ్‌గా మారుతుంది.  బిల్‌గేట్స్‌ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని కలిశాను. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్ ఆయనకు చూపించాను. భారత్‌ ఐటీలో ఎలా అభివృద్ధి అవుతోంది, ఆవిష్కరణలు ఎలా జరుగుతున్నాయి వంటి మన బలాలను వారికి వివరించాను. దీనికి బిల్‌గేట్స్‌ ఇంప్రెస్ అయ్యారు. మీకు ఏం కావాలని ఆయన అడగగా.. భారతీయులను నమ్మండని చెప్పాను. మళ్లీ వస్తే హైదరాబాద్‌కు రావాలని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. దావోస్‌లో ఆయన్ని కలిసేవాన్ని. హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. 

Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

బీజేపీ సమయం కన్నా ముందుగా ఆలోచిస్తుంది. ఆ పార్టీ నాయకత్వం సమర్థవంతంగా ఉంటుంది. ప్రధాని మోదీ యువకులను, బాగా చదువుకున్న నాయకులను ఎంపిక చేసుకుంటున్నారు. భారత్‌కు ఆకాశమే హద్దు. వచ్చే పదేళ్లు భారత పురోగతికి ఎంతో కీలకం. నాయకత్వంతోనే మార్పు వస్తుంది. నేను హైదరాబాద్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా మార్చాను. ఫార్మా, ఫైనాన్స్, స్పోర్ట్‌ వంటి రంగాలను అభివృద్ధి చేశాను. అమరావతి కూడా ఫ్యూచరిస్టిక్‌ సిటీగా మారుతుందని'' చంద్రబాబు అన్నారు. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

 chandra babu naidu | pm modi | telugu-news | rtv-news 

Advertisment
తాజా కథనాలు