NEET-PG Exam: నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

నీట్‌ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

author-image
By B Aravind
New Update
Supreme Court

Supreme Court

నీట్‌ పీజీ పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒకే షిఫ్టులో పరీక్షను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. కానీ దీనిపై పలువురు అభ్యంతరం తేలిపారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశించింది. జూన్ 15న నీట్ పీజీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆరోజు ఒకే షిఫ్టులో పరీక్ష జరగనుంది. 

Also Read: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది

NEET-PG Exam 2025 - Supreme Court

కొన్నేళ్లుగా నీట్ పీజీ లాంటి ప్రధాన పరీక్షలు రెండు వేరువేరు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సిస్టమ్‌ను ప్రశ్నించింది. ''రెండు షిఫ్టుల్లో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత భిన్నంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూర్చినప్పటికీ మరికొందరికీ ఇబ్బంది కలిగించవచ్చు. రెండు ప్రశ్నపత్రాల క్లిష్టత స్థాయిని ఒకేలా పరిగణించలేం. ఇది అసమానత, ఏకపక్షతకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులందరికీ న్యాయం చేయాలంటే ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడం అవసరమని'' సుప్రీంకోర్టు చెప్పింది.  

Also Read: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!

ఒకే విడుతలో పరీక్ష నిర్వహణకు కేంద్రాలు, సమయం సరిపోదని ఎన్‌ఈబీ వాదనలు చేసింది. కానీ సుప్రీం ధర్మాసనం దీన్ని తిరస్కరించింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. జూన్ 15 జరగబోయే పరీక్ష ఏర్పాట్లు సమయం ఉందని తెలిపింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒకే షిఫ్టు వల్ల అభ్యర్థులందరూ ఒకే సమయంలో పరీక్షకు హాజరవుతారు. 

Also Read: ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి..ఒకే వేదికపై ఉగ్రవాదులు, పాక్ మంత్రులు

Also Read :  గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన మైత్రీ మేకర్స్ సినిమాలు.. ఏకంగా అన్ని సినిమాలకు అవార్డు !

 telugu-news | rtv-news | neet-pg

Advertisment
తాజా కథనాలు