🔴Live News Updates: పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ లో బిగ్ ట్విస్ట్... ఊరటనిచ్చిన కోర్టు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.

mla-padi-kaushik-reddy

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. క్వారీ యజమానిని బెదిరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై  కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన్ని శనివారం ఉయదం 4గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు కొట్టివేసింది.

 

  • Jun 21, 2025 21:22 IST

    పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ లో బిగ్ ట్విస్ట్... ఊరటనిచ్చిన కోర్టు

    హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. క్వారీ యజమానిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో అరెస్ట్‌ అయిన ఆయనకు ఖాజీపేట రైల్వేకోర్టు మొదట 14 రోజలు రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

     

    BRS MLA Padi Kaushik Reddy
    BRS MLA Padi Kaushik Reddy

     



  • Jun 21, 2025 20:29 IST

    రైతుల ఖాతాల్లో రూ.7,770.83 కోట్లు జమ: మంత్రి తుమ్మల

    తెలంగాణలో శనివారం నాటికి 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే రైతుల అకౌంట్లలోకి రూ.7,770.83 కోట్ల నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

     



  • Jun 21, 2025 20:29 IST

    'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్

    'కుబేరా' బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. దీంతో చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగార్జున, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీమ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.

     



  • Jun 21, 2025 20:28 IST

    ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 310 మంది

    కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చారు. మొత్తం ఇప్పటిదాకా 827 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

     

    Another Flight From Iran Brings 310 Indians Home, Total Evacuated Now 827
    Another Flight From Iran Brings 310 Indians Home, Total Evacuated Now 827

     



  • Jun 21, 2025 18:57 IST

    ప్రమాదంలో మరో విమానం.. మేడే అంటూ పైలెట్ల సందేశం

    గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

     

    IndiGo Flight
    IndiGo Flight

     



  • Jun 21, 2025 18:56 IST

    తెలంగాణ ప్రజలకు అలెర్ట్‌ అత్యవసర సేవలకు కొత్త నెంబర్‌ ఇదే

    అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట అత్యవసర సేవలకు డయల్‌ 100 కాకుండా 112 నెంబర్‌కు కాల్‌ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ ని ప్రభుత్వం విడుదల చేసింది.

    For All Emergencies, Just Dial 112



  • Jun 21, 2025 18:22 IST

    వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. నెలకు రూ.2,016 పెన్షన్‌

    డయాలసిస్‌ పేషెంట్లకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్ చెప్పింది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    Dialysis



  • Jun 21, 2025 17:26 IST

    EdCET: ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల..

    తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి శనివారం ఫలితాలు విడుదల చేశారు.

     

    TG EdCET 2025 Results Declared
    TG EdCET 2025 Results Declared

     



  • Jun 21, 2025 15:30 IST

    కౌశిక్ రెడ్డి కేసు... వరంగల్‌లో ఉద్రిక్తత

    హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్‌కు తీసుకువచ్చారు.

    MLA Padi Kaushik Reddy Arrest



  • Jun 21, 2025 15:29 IST

    వరల్డ్ ప్యారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా!

    బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ భారత ప్యారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ 2025 బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడంపై కంగనా సంతోషం వ్యక్తం చేశారు.

     

    kangana brand ambassador for  Athletics World Championships
    kangana brand ambassador for Athletics World Championships

     



  • Jun 21, 2025 15:28 IST

    అఘోరికి బిగ్‌ షాక్‌.. రేప్‌ కేసు నమోదు

    రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి మరో బిగ్ షాక్‌ తగిలింది. కరీంనగర్‌లో నమోదైన అత్యాచారం కేసుపై అక్కడి కోర్టులో విచారణ సాగింది . అఘోరీ తనను పూజల పేరుతో లొంగదీసుకుని శారీరకంగా వేధించాడని రాధిక అనే మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

    Aghori



  • Jun 21, 2025 14:30 IST

    IND vs ENG : ధోనీ రికార్డు ఔట్.. చరిత్ర సృష్టించిన పంత్!

    ఇంగ్లండ్ తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్  అరుదైన రికార్డను నెలకొల్పాడు.   SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా) అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

    ms-dhoni vs pant



  • Jun 21, 2025 14:29 IST

    ఎయిరిండియా నుంచి వాళ్లని తొలగించండి.. DGCA సంచలన ఆదేశాలు

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని ఆదేశించింది.

     

    DGCA Directs Air India To Remove 3 Senior Officials Over Recent Safety Lapses
    DGCA Directs Air India To Remove 3 Senior Officials Over Recent Safety Lapses

     



  • Jun 21, 2025 13:39 IST

    Bajaj Freedom 125 Price Drop: అరాచకం భయ్యా.. బజాజ్ CNG బైక్‌పై భారీ తగ్గింపు.. అస్సలు వదలొద్దు!

    Bajaj Freedom 125 సీఎన్జీ బైక్ ధర తగ్గింది. బేస్ వేరియంట్‌పై కంపెనీ రూ. 5000 తగ్గించింది. ఈ తగ్గింపుతో రూ. 90,976గా ఉండే దీని ధర ఇప్పుడు రూ.85,976కు చేరుకుంది. మిడ్, టాప్ వేరియంట్‌ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఇది సీఎన్జీ, పెట్రోల్ రెండింటితోనూ నడుస్తుంది.

    Bajaj Freedom 125 cng bike price8



  • Jun 21, 2025 13:38 IST

    Kavya Maran: స‌న్ టీవీ షేర్లు డౌన్.. కష్టాల్లో కావ్య మారన్.. సన్రైజర్స్ ఉంటుందా?

    భారత్ లోనే అతిపెద్ద మీడియా సంస్ధల్లో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్ యజమానులు మారన్ కుటుంబంలో  ఆస్తి వివాదాలు రచ్చకెక్కాయి.  కళానిధి మారన్‌కు ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులను పంపించారు.  

    sunrisers hyd



  • Jun 21, 2025 13:37 IST

    Sri Varshini Missing: అఘోరీకి బిగ్ షాక్.. శ్రీ వర్షిణి మిస్సింగ్..!

    అఘోరీ శ్రీనివాస్ భార్య శ్రీవర్షిణి కనిపించడం లేదు. ఆమె నిన్ననే గచ్చిబౌలి రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి రిలీజ్ అయింది. అక్కడ నుంచి ఎటు వెళ్లిందో తెలియలేదు. విజయవాడలోని ఇంటికి తాళం వేసి ఉండటంతో, అఘోరీ ఇంటికి వెళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

     

    Lady Aghori wife Sri Varshini Missing
    Lady Aghori wife Sri Varshini Missing

     



  • Jun 21, 2025 11:02 IST

    School Holidays: జూలై 1 నుంచి 10 వరకు స్కూళ్లకు సెలవులు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

    జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో తీవ్రమైన వేడిగాలుల కారణంగా అక్కడి ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల సమయాల్లో మార్పులు చేసింది. అలాగే కాశ్మీర్ డివిజన్‌లోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు జూలై 1 నుండి 10 వరకు పదిరోజుల వేసవి సెలవులను ప్రకటించింది.

     

    srinagar sizzles record heat prompts school timing changes and school holidays
    srinagar sizzles record heat prompts school timing changes and school holidays

     



  • Jun 21, 2025 11:02 IST

    Iran-Isreal War: ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ పని ఖతం.. ఇప్పుడు రంగంలోకి అమెరికా THAAD

    ఇరాన్ క్షిపణుల ధాటికి ఇజ్రాయిల్ ఐరన్ నెమ్మదిగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయిల్‌కు టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్‌ను పంపనుంది. దీంతో ఇజ్రాయిల్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    US THAAD



  • Jun 21, 2025 11:01 IST

    Mahbubnagar : ఓరేయ్ కామాంధుడా.. ఏడేండ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి

    జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు.  మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.  

    seven-years



  • Jun 21, 2025 11:01 IST

    USA: ఇజ్రాయెల్ కు అంత లేదు..ట్రంప్

    ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్..ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదన్నారు.

     

    Donald Trump
    Donald Trump

     



  • Jun 21, 2025 11:00 IST

    International Yoga Day 2025: విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు..

    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు వరించింది. 25వేల మంది గిరిజన స్టూడెంట్స్‌తో 108 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ రికార్డు సాధించిన విద్యార్థులను నారా లోకేష్ అభినందించారు.

     

    International Yoga Day 2025 pm modi
    International Yoga Day 2025 pm modi

     



  • Jun 21, 2025 11:00 IST

    Sai Sudarshan : అరంగేట్రంలోనే డకౌట్..సాయి సుదర్శన్ చెత్త రికార్డు!

    చతేశ్వర్ పుజారా నుంచి టెస్ట్ క్యాప్ అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎంపికైన సాయి, గతంలో విరాట్ కోహ్లీ, పుజారా వంటి దిగ్గజాలు ఆడే స్థానంలో ఆడటం వల్ల ఒత్తిడిని ఎదుర్కొన్నాడు

    saisudarshan



  • Jun 21, 2025 10:59 IST

    అటు జనీవాలో ఇరాన్, ఇజ్రాయిల్ చర్చలు.. ఇటు పరస్పర క్షిపణి దాడులు

    టెల్‌ అవీవ్, హైఫా, బీర్‌షిబాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. హైఫాపై ఇరాన్‌ చేసిన దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ ఇరాన్‌లోని కెర్మన్‌షా, తబ్రీజ్‌ ప్రాంతాలలో బాలిస్టిక్‌ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.

    _Israel and Iran



  • Jun 21, 2025 10:58 IST

    Pakistan: పాక్ కు చైనా J-35 స్టెల్త్ జెట్స్..వీటితో భారత్ కు ముప్పు తప్పదా?

    భారత్ ఈమధ్య కలంలోనే రఫేల్ యుద్ధ విమానాలు కొంది. దానికి ప్రతిగా ఇప్పుడు పాక్ జే-35 స్టెల్త్ ఫైటర్ జెట్ లను చైనా నుంచి కొనుగోలు చేసింది. అమెరికా ఫైటర్ జెట్ ఎఫ్-35 కన్నా ఇవి పవర్ ఫుల్ అని చెబుతున్నారు. 

     

    J-35
    J-35 Stealth Jets

     



  • Jun 21, 2025 10:53 IST

    Kubera OTT: ఓటీటీలోకి ‘కుబేర’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    ధనుష్, నాగార్జున కలిసి నటించిన ‘కుబేర’ మూవీ ఓటీటీపై ఓ అప్డేట్ వైరలవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ.47 కోట్లకు కొనుక్కున్నట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాలకు ఇది 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.

     

    Kubera OTT streaming date
    Kubera OTT streaming date

     



  • Jun 21, 2025 10:52 IST

    Pakistan : ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేసిన పాకిస్థాన్

    పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను  నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. రెండు న్యూక్లియర్ దేశాల(భారత్, పాక్) మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఎక్స్ వేదికగా  పోస్ట్ చేసింది.

    trump pakm/international/pakistan-nominates-donald-trump-for-2026-nobel-peace-prize-secured-a-ceasefire-9382214



  • Jun 21, 2025 10:48 IST

    Liquor Ban: మద్యం తాగితే లక్ష జరిమానా, ఏడు చెప్పు దెబ్బలు

    మద్యపాన నిషేధంలో భాగంగా కొన్ని గ్రామాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని మిగితా గ్రామలకు  ఆదర్శంగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు.

    ban



  • Jun 21, 2025 10:44 IST

    Iran-Israel War: మొన్న సై..ఇవాళ నై...ఇరాన్ కు ముఖం చాటేస్తున్న మిత్ర పక్షం

    హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, సిరియా, మిలీషియా, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్. ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్న కనిపించడం లేదు.

     

    iran-allies
    iran-allies silent On Israel War

     



  • Jun 21, 2025 10:41 IST

    అతిపెద్ద సైబర్ కుంభకోణం.. 1,600 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్

    ఆన్‌లైన్‌లో ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు లీక్‌గా అయ్యాయని సైబర్‌న్యూస్‌, ఫోర్బ్స్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

    16 billion passwords



  • Jun 21, 2025 10:36 IST

    Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు.. ఇక రచ్చ రచ్చే

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని జులై 24న రిలీజ్‌ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ ఊరమాస్ లుక్ అదిరిపోయింది. 

     

    Hari Hara Veera Mallu Release Date announced
    Hari Hara Veera Mallu Release Date announced

     



  • Jun 21, 2025 10:33 IST

    Iran Earthquake : ఇరాన్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు!

    జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు.

    iran-earthquake



  • Jun 21, 2025 10:33 IST

    Iran: చమురుకు ఇక కటకటే..హర్మూజ్ ను మూసేస్తామంటున్న ఇరాన్

    ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇందులోకి అగ్రరాజ్యం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కాస్త బలహీన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇరాన్ వేరే రకంగా భయపెట్టడానికి చూస్తోంది. హర్మూజ్ జలసంధిని బూచిగా చూపిస్తోంది. 

     

    strait-of-hormuz
    strait-of-hormuz

     



  • Jun 21, 2025 10:30 IST

    International Yoga Day 2025: యోగా డే స్పెషల్.. మంచి నిద్ర, ఏకాగ్రత, ప్రశాంతత కోసం యోగా ఒక వరం

    ప్రస్తుత జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న విద్యార్థులకు యోగా ఒక వరం. మంచి నిద్ర నుంచి మెరుగైన ఏకాగ్రత వరకు యోగా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, భావోద్వేగాలను కంట్రోల్ చేయడం వరకు యోగా చాలా ఉపయోగపడుతుంది.

     

    yoga benefits for students better sleep and posture to focus
    yoga benefits for students better sleep and posture to focus

     



  • Jun 21, 2025 10:29 IST

    Operation Sindhu: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది భారతీయులు

    ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి రెండో విమానం భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. తుర్క్మెనిస్తాన్‌లోని అష్గాబాత్ నుంచి 290 మంది విద్యార్థులు శనివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. 2 రోజుల క్రితం 110 మందిని తీసుకొచ్చారు.

    Indian students from Iran



  • Jun 21, 2025 10:28 IST

    Thailand: ఫోన్ కాల్ లీక్..పీఎం పదవికే గండం..

    గోడలకు చెవులుంటాయి..అలాగే ఫోన్లకూ లీక్ లు ఉంటాయి. టెక్నాలజీ అరివీర భయంకరంగా పెరిగిన పోయిన ఈరోజుల్లో ఒళ్ళఉ దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా లేకపోతే థాయ్ ప్రధాని షిపవ్రతాలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక ఫోన్ కాల్ ఇప్పుడు ఆమె పదవికే గండం తెచ్చిపెట్టింది. 

     

    shinawatra
    Thailand PM Shinawtra

     



  • Jun 21, 2025 07:03 IST

    Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల

    తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల  సంచలన కామెంట్స్ చేశారు.  టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని..  వారిని తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు.  ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు.

    ananaya



  • Jun 21, 2025 07:01 IST

    Telangana Crime News: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికి.. భయంతో ఉరేసుకున్న తెలంగాణ యువకుడు

    తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ గోపీ (25) ఆందోళనకు గురై ఉరేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కోర్టుకు హాజరై ఫైన్ కట్టాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించడంతో భయంతో సూసైడ్ చేసుకున్నాడు.

     

    Khammam youth suicide after caught drunk and driving
    Khammam youth suicide after caught drunk and driving

     



  • Jun 21, 2025 06:36 IST

    Ind vs Eng: దంచికొట్టిన టీమ్ ఇండియా బ్యాటర్లు..జైస్వాల్, గిల్ సెచరీలు

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో తొలిరోజు ఆట భారత్ దే ఆధిపత్యంగా సాగింది. భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభ్ మన్, జైస్వాల్ సెంచరీలు చేయగా..రిషభ్ పంత్ హాఫ్ సెచరీ చేసి స్కోరును పరుగులు పెట్టించారు.

     

    jaiswal, gill
    First Test With England

     



  • Jun 21, 2025 06:35 IST

    Shubman Gill : సెంచరీ బాదిన గిల్.. రికార్డుల మోత

    లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు.  దీంతో గిల్ తన ఖాతాలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

    jaiswal, gill
    First Test With England



Advertisment
Advertisment
తాజా కథనాలు