/rtv/media/media_files/2025/06/21/kangana-brand-ambassador-for-athletics-world-championships-2025-06-21-14-31-57.jpg)
kangana brand ambassador for Athletics World Championships
భారత ప్యారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ (World Para Athletics Championship) నూతన అధ్యాయం మొదలైంది. 2025 ఛాంపియన్ షిప్ పోటీలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు 100కు పైగా దేశాల నుండి 1,000 మందికి పైగా అథ్లెట్లు హాజరవుతారు. ఇది భారతదేశంలో జరగనున్న అతిపెద్ద ప్యారా క్రీడా ఈవెంట్ కానుంది. ఈ నేపథ్యంలో ప్యారా అథ్లెటిక్స్ 2025 బ్రాండ్ అంబాసిడర్ ని ప్రకటించారు. బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) అధికారికంగా ప్రకటించింది.
Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
బ్రాండ్ అంబాసిడర్ గా
వరల్డ్ ప్యారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడంపై కంగనా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కంగనా మాట్లాడుతూ.. ''భారత ప్యారా అథ్లెట్లు ప్రతిరోజూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. వారి అద్భుతమైన విజయాల గురించి అవగాహన పెంచడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. ప్యారా క్రీడ అనేది కేవలం పోటీ కాదు, అది ధైర్యం" ! అని అన్నారు.
Also Read: HBD Klinkara: బర్త్ డే స్పెషల్..క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన - ఎంత క్యూట్‌గా ఉందో
PCI అధ్యక్షుడు, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ దేవేంద్ర ఝఝారియా కూడా కంగనా నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత అథ్లెట్ల పట్ల ఆమెకున్న నిబద్ధత ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్‌కు ఆమెను ఆదర్శ అంబాసిడర్‌గా చేస్తుంది" అని కొనియాడారు.
Also Read: International Yoga Day 2025: యోగా డే స్పెషల్.. మంచి నిద్ర, ఏకాగ్రత, ప్రశాంతత కోసం యోగా ఒక వరం
Also Read : వ్యాయామం చేసినా బరువు తగ్గ లేకపోతున్నారా..? చివరిగా ఇలా ప్రయత్నం చేయండి!!
actress-kangana-ranaut | Athletics World Championships