Pakistan : ట్రంప్ను నోబెల్కు నామినేట్ చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను  నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. రెండు న్యూక్లియర్ దేశాల(భారత్, పాక్) మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఎక్స్ వేదికగా  పోస్ట్ చేసింది.

New Update
trump pak

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను  నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. రెండు న్యూక్లియర్ దేశాల(భారత్, పాక్) మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఎక్స్ వేదికగా  పోస్ట్ చేసింది. 2026లో ఆయనకు నోబెల్ ఇవ్వాలని కోరింది. ట్రంప్ తో  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భేటీ అనంతరం ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా శాంతి కోసం ఏం చేసినా తనకు నోబెల్ రాదని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  

ఏంచేసినా రాదు

ఏంచేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదన్నారు. కానీ ఇవన్నీ ప్రజలకు తెలుసని, అది చాలంటూ పోస్ట్ పెట్టారు. 'కాంగో, రువాండా మధ్య ఒప్పందం కుదిరింది. ఇది ఆఫ్రికాకు శుభదినం. భారత్-పాక్, సెర్బియా-కొసోవో, ఈజిప్ట్ ఇథియోపియా, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాలు ఆపినా, మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొల్పినా నాకు నోబెల్ రాదని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు