/rtv/media/media_files/2025/06/21/bajaj-freedom-125-cng-bike-2025-06-21-12-43-53.jpg)
bajaj freedom 125 CNG bike
బజాజ్ తన కొత్త CNG బైక్ ‘Bajaj Freedom 125’ పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ Bajaj Freedom 125 బైక్ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా బేస్ వేరియంట్ ధరను తగ్గించింది. డ్రమ్ బ్రేక్‌లతో కూడిన బేస్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గించింది. ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 85,976 కు చేరుకుంది. గతంలో దీని ధర రూ. 90,976గా ఉండేది. అయితే మిడ్, టాప్ వేరియంట్‌ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. మిడ్ వేరియంట్ ధర రూ. 95,981 ఎక్స్ షోరూమ్, టాప్ వేరియంట్ ధర రూ. 1,10,976 ఎక్స్ షోరూమ్‌గా ఉంది.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
bajaj freedom 125 Price Drop
అన్ని వేరియంట్లలో 125 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది సీఎన్జీ, పెట్రోల్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ బైక్ 9.5 పిఎస్, 9.7 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ధర తగ్గింపు పొందిన బేస్ వేరియంట్‌లో హాలోజన్ హెడ్‌ల్యాంప్ ఉండగా, మిగతా రెండు వేరియంట్‌లలో ఎల్‌ఇడి పవర్డ్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
Bajaj Freedom 125 బేస్ వేరియంట్ వెనుక భాగంలో 110 mm డ్రమ్ బ్రేక్, ముందు భాగంలో 130mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అన్ని వేరియంట్లలో CBS బ్రేకింగ్ సెటప్ ఉంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, సోఫ్ట్-డ్యూయల్ రైడింగ్ సీట్, నైట్రో షాక్ అబ్సార్బర్‌తో రియర్ సస్పెన్షన్ వంటివి అందించారు.
ఈ బైక్ CNG పై దాదాపు 200 కి.మీ మైలేజ్ ఇస్తుంది. లీటర్ పెట్రోల్‌తో భారీగా మైలేజ్ అందిస్తుంది. ఇందులో LED DRLs, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా Bajaj Freedom 125 బైక్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది.