తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని.. వారిని తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు 20శాతం మాత్రమే అవకాశాలు వస్తున్నాయని.. 80శాతం ఇతర బాష హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తున్నారని చెప్పారు. మిగితా బాషల్లో కూడా తెలుగమ్మాయిలకు 20శాతం మాత్రమే అవకాశాలు వస్తున్నాయని అన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్. హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుందన్నారు.
కేరవాన్‌లో ఏడ్చేసి..
బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగిందన్నారు. కానీ తన విషయంలో మంచి హిట్స్ పడిన అవకాశాలు రావడం లేదని వాపోయారు. దీనిపై ఆలోచించడం మొదలుపెట్టి తర్వాత తన కోసం తాను మార్కెటింగ్ చేసుకోవడం మొదలుపెట్టానన్నారు అనన్య. ఇక తాను సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన టైమ్ లో బ్రేకప్ జరిగిందని చెప్పుకొచ్చారు అనన్య. రాత్రంతా ఏడ్చి ఉదయాన్ని జిమ్‌కు వెళ్లిపోయేదాన్ని. కేరవాన్‌లో ఏడ్చేసి.. ఏం జరగనట్లు కళ్లు తుడుచుకుని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని అని తెలిపారు.
ఈ విషయం ఫ్రెండ్స్ కు తప్ప .. ఇంట్లో వాళ్లకు తెలియదన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మల్లేశం సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అనన్య నాగళ్ల వకీల్ సాబ్, తంత్ర, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించింది. పొట్టేల్ సినిమాకుగానూ గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది.
Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల సంచలన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని.. వారిని తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం ఇంకా పోరాటం చేస్తున్నామని అన్నారు.