/rtv/media/media_files/2025/06/21/kubera-ott-streaming-date-2025-06-21-08-23-00.jpg)
Kubera OTT streaming date
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కలిసి నటించిన కొత్త చిత్రం ‘కుబేర’. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ నిన్న (జూన్ 20)న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
Kubera OTT
సినీ ప్రియులు, అభిమానులకు ఈ చిత్రం తెగ నచ్చేస్తుంది. ఇందులో ధనుష్, నాగార్జున యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అలాగే మూవీలో దేవీశ్రీ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాంగుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. శేఖర్ కమ్ముల టేకింగ్ కూడా అత్యద్భుతంగా ఉందని టాక్ వినిపిస్తోంది.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ యాక్టింగ్ చించేసాడని చెప్పుకొస్తున్నారు. అతడి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందని తెగ పొగిడేస్తున్నారు. అతడి యాక్టింగ్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా అని కామెంట్లు చేస్తున్నారు. ఇలా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటున్న కుబేర మూవీ ఓటీటీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కుబేర ఓటీటీ హక్కులను ప్రముక స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు కొనుక్కున్నట్లు సమాచారం. సుమారు రూ.47 కోట్లతో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం.. కుబేర మూవీ థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాలకు ఓటీటీల్లోకి రానున్నట్లు సమాచారం. ఇది ఏకంగా 5 భాషల్లో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.