Ind vs Eng: దంచికొట్టిన టీమ్ ఇండియా బ్యాటర్లు..జైస్వాల్, గిల్ సెచరీలు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో తొలిరోజు ఆట భారత్ దే ఆధిపత్యంగా సాగింది. భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభ్ మన్, జైస్వాల్ సెంచరీలు చేయగా..రిషభ్ పంత్ హాఫ్ సెచరీ చేసి స్కోరును పరుగులు పెట్టించారు.

New Update
jaiswal, gill

First Test With England

సీనియర్లు లేని జట్టు ఆడుతోంది. అది కూడా మంచి ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ తో అని అందరూ భయపడ్డారు. కానీ అందరి అంచనాలను మించి భారత జట్టు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళుతోంది. మొదట రోజునే తమ ప్రతాపాలను చూపించారు భారత బ్యాటర్లు. కెపటెన్ శుభ్ మన్ గిల్ స్వయంగా రెచ్చిపోయాు. తనదైన శైలి ఆట ఆడుతూ సెంచరీతో దూసుకుపోయాడు.  ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (127*; 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో అలరించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. రిషభ్ పంత్ (65*; 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. అలాగే మరో ఓపెనర్ కే ఎల్ రాహుల్ కూడా 42 పరుగులతో రాణించాడు. ఒక్క సాయి సదర్శన్ మాత్రమే డకౌట్ అయి నిరాశ పర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2, బ్రైడన్ కార్స్ ఒక వికెట్ పడగొట్టారు. 

Advertisment
తాజా కథనాలు