International Yoga Day 2025: యోగా డే స్పెషల్.. మంచి నిద్ర, ఏకాగ్రత, ప్రశాంతత కోసం యోగా ఒక వరం

ప్రస్తుత జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న విద్యార్థులకు యోగా ఒక వరం. మంచి నిద్ర నుంచి మెరుగైన ఏకాగ్రత వరకు యోగా ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, భావోద్వేగాలను కంట్రోల్ చేయడం వరకు యోగా చాలా ఉపయోగపడుతుంది.

New Update
yoga benefits for students better sleep and posture to focus

yoga benefits for students better sleep and posture to focus

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆందోళనలతో చాలా మంది సతమతమవుతున్నారు. తరచూ పనిభారంతో నిద్రకు కరువవుతున్నారు. మానసికంగా కృుంగిపోతున్నారు. ఇలా తిండి, నిద్ర లేకపోవడంతో అనారోగ్య బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి యోగా అనేది ఒక వరం. మంచి నిద్ర, మెరుగైన ఏకాగ్రత పొందాలంటే యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

yoga benefits

యోగా అనేది ఆందోళనను కంట్రోల్ చేసి.. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ యోగాతో తమ ఏకాగ్రతను మరింత మెరుగుపరచుకోవచ్చు. తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్‌ యోగా డే. ఈ సందర్భంగా దీనికి సంబంధించి పలు విషయాలు తెలుసుకుందాం. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

శరీర వశ్యత, సమతుల్యత, బలం, మొత్తం శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో యోగాసనాలు ఎంతగానో సహాయపడతాయి. చక్కటి విద్యా పనితీరుకు ఇవి దారితీస్తాయి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

శారీరక, మానసిక ఆరోగ్యం

నేటి ఆధునిక జీవితంలో యువతకు యోగా అనేది చాలా అవసరం. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఒత్తిడితో బాధపడుతున్నవారికి యోగా ఒక అద్భుతమైన విముక్తి అందిస్తుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడుతుంది.

 Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

ఏకాగ్రత

క్రమం తప్పకుండా యోగా చేస్తే ఏకాగ్రత, దృష్టి పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా నాణ్యమైన నిద్ర పొందవచ్చు. ముక్యంగా విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. పరీక్షల టైంలో ఒత్తిడిని జయించి ఏకాగ్రత పొందాలంటే యోగాసనాలు చాలా ఉపయోగపడతాయి. 

ఆరోగ్యం మెరుగుపడుతుంది

యోగాసనాలు తరచూ చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. అలాగే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఒత్తిడిని మరింత తెలివిగా ఎదుర్కోవడానికి యోగా అనేది సహాయపడుతుంది. దీంతో పాటు మరెన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు