/rtv/media/media_files/2025/06/21/hari-hara-veera-mallu-release-date-announced-2025-06-21-07-41-27.jpg)
Hari Hara Veera Mallu Release Date announced
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని జులై 24న (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ ఊరమాస్ లుక్ అదిరిపోయింది.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
Hari Hara Veera Mallu Release Date
One fights for Power.
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 21, 2025
One fights for Dharma.
The clash of legacies begins. 🔥
Witness the Battle for truth, faith and freedom 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒, 𝟐𝟎𝟐𝟓 ⚔️🔥
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu 🏹#HHVMonJuly24th #HHVM… pic.twitter.com/WHLUZWtavA
పవన్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇకపోతే ఈ మూవీ ప్రారంభమై రెండు మూడేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీ బిజీగా ఉండటం, బ్యాక్ గ్రౌండ్ వర్క్ పెండింగ్ వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చాలా డేట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్లు వాయిదా వేశారు. చివరికి జూన్ 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోడేట్ అనౌన్స్ చేశారు. ఈ సారి ఈ డేట్ మారకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి