Mahbubnagar : ఓరేయ్ కామాంధుడా.. ఏడేండ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి

జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు.  మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.  

New Update
seven-years

కామాంధులు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడది కనిపిస్తే చాలు మృగల్లా చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కామా పిశాచుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు ఎక్కడా లేని కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది.  ఏడేళ్ల బాలికపై ఓ మైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు.  జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు.  మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.  

తల్లి ముందు నడుస్తుండగా

కట్టెలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో తల్లి ముందు నడుస్తుండగా ఆ బాలిక కాస్త వెనుకబడింది. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు ఆ  బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఓడగొట్టాడు. అంతేకాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడు బెదిరించాడు. చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట అని ఏడ్వడంతో తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు.  వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ కమలాకర్‌‌‌‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.  

 

Advertisment
Advertisment
తాజా కథనాలు