/rtv/media/media_files/2025/06/21/srinagar-sizzles-record-heat-prompts-school-timing-changes-and-school-holidays-2025-06-21-10-38-35.jpg)
srinagar sizzles record heat prompts school timing changes and school holidays
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఎండ తీవ్రత భారీ స్థాయిలో నమోదు అవుతుంది. వరుసగా నాలుగు రోజులుగా తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. నిన్న (శుక్రవారం) అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు నమోదైంది. గురువారం 35.2 డిగ్రీల రికార్డును అదిగమించింది. శుక్రవారం 35.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరిగింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యంత వేడిగా ఉన్న రోజుగా జూన్ 20ను చెప్పుకోవచ్చు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
School Holidays
దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. చిన్నారులు సైతం వేడుగాలులకు తట్టుకోలేకపోతున్నారు. వారి సౌకర్యార్థం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ విద్యా మంత్రి సకినా ఇటూ.. శ్రీనగర్ మునిసిపల్ పరిమితుల్లో, కాశ్మీర్ లోయ అంతటా పాఠశాల సమయాల్లో గణనీయమైన మార్పులు చేశారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
జూన్ 21 నుండి శ్రీనగర్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పనిచేసేలా సమయాలను మార్చారు. ఇక మున్సిపల్ పరిమితికి వెలుపల ఉన్న పాఠశాలలు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయని తెలిపారు.
Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?
మరోవైపు స్కూల్ టైమింగ్స్ మార్చడంతో పాటు కాశ్మీర్ డివిజన్‌లోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. జూలై 1 నుండి జూలై 10వ తేదీ వరకు పది రోజుల వేసవి సెలవులను ప్రకటించారు. ఎక్కువగా వేడి గాలులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్నందున పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. జూలై 10 తర్వాత వాతావరణ పరిస్థితులను సమీక్షించి దానికి అనుగుణంగా సెలవులను పొడిగించడంపై నిర్ణయం తీసుకుంటాము అని ఆమె తెలిపారు.