/rtv/media/media_files/2025/06/21/for-all-emergencies-just-dial-112-2025-06-21-18-53-11.jpg)
For All Emergencies, Just Dial 112
Dial 112: అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట అత్యవసర సేవలకు డయల్ 100 కాకుండా 112 నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ ని ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇక మీదట అత్యవసర సేవల కోసం 112 నెంబర్ కి కాల్ చేస్తే అన్ని రకాల సేవలు లభిస్తాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది వరకు వేర్వేరు సేవకలకు గాను వేర్వేరు నెంబర్లు ఉండేవి. పోలీస్ 100, ఫైర్ 101, మెడికల్ 109, చైల్డ్ 1098 ఇలా అవసరాన్ని బట్టి ఆయా నెంబర్లకు ఫోన్ చేయాల్సి వచ్చేంది. అయితే ఇక మీదట అన్ని సేవలకు గాను ఒకే అత్యవసర నెంబర్ కింద ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇకమీదట అన్ని అత్యవసర సేవల కోసం 112 డయల్ చేస్తే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సంఘటన స్థలానికి అధికారులను పంపించేలా కొత్తగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరారు. దీన్ని ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: డైరెక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం
అమెరికాలోని 911 తరహాలో మన దేశంలోనూ దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర నంబర్ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లు 112 నంబర్ ను తీసుకు వచ్చింది. దీనికి ప్రాచుర్యం కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలో అన్ని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది, దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఒకటి, రెండు నెలల్లో డయల్ 112పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
ఇది కూడా చదవండి: యోగాసనాలు మహిళలకు ఓ వరం.. రోజూ చేస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు
రెండు నెలల వరకూ పాత నంబరే..
అయితే రెండు నెలల వరకూ పాత నంబర్‌కు కాల్స్ చేసిన112 నంబర్‌కు అనుసంధానమవుతుందని తెలిపారు.ఈ నెల చివరి వారంలోపు డయల్ 112కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్‌శాఖ అధికారులు, కంట్రోల్ రూంలకు నేర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా డయల్ 112పై అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తు్న్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద దీనికి సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా డయల్ 100కు ఫోన్ చేస్తే.. 10 నిమిషాల్లో అత్యవసర స్పందన బృందం (ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) సంఘటన స్థలాలకు చేరుకుంటోంది. ఈ సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో 8 నిమిషాలకు తగ్గించనున్నారు.
Also Read : బొమ్మ పిస్టల్ తో బెదిరించి దోపిడీ... 500 సీసీ కెమెరాలు శోధించి... తీగలాగితే..
112 ఎందుకంటే...
అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో దేశ వ్యాప్తంగా ఒకే నెంబర్ అమల్లో ఉంది. ఆ దేశాల తరహాలో అత్యవసర సేవల కోసం వివిధ దేశాలు దేశవ్యాప్తంగా ఒకే నంబరును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. మన దేశంలోనూ అదే తరహానంబరు ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదించిన అనంతరం రెండేళ్ల క్రితం 112 నంబరును వినియోగించాలని సూచించింది.
Also Read : కాఫీ-తేనె కలిపి ముఖానికి రాస్తే ఆశ్చర్యపోయే అందం.. ఇలా వాడారంటే...!!
108 Ambulance services | 108-ambulance | Hyderabad emergency news | Emergency Response | emergency