/rtv/media/media_files/2024/11/05/ScnuYgh1QmmOCFa5FDSW.jpg)
Lady Aghori
రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి మరో బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్‌లో నమోదైన అత్యాచారం కేసుపై ఈ రోజు అక్కడి కోర్టులో విచారణ సాగింది . అఘోరీ తనను పూజల పేరుతో లొంగదీసుకుని శారీరకంగా వేధించాడని, పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ రాధిక అనే మహిళ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కరీంనగర్ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది, కాగా ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న అఘోరీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కాగా అఘోరీని నేరుగా కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ జడ్జి పోలీసులను ప్రశ్నించారు. అయితే నేరుగా ప్రవేశపెడితే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయంటూ పోలీసులు న్యాయ మూర్తికి వివరించారు.
Also Read:వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
Also Read : మూత్రం చుక్కచుక్కగా.. చుక్కలు చూపిస్తుందా..? ఆ అవయవం పని చేయనట్టే వెంటనే..!!
Rape Case On Lady Aghori
కాగా ఈ కేసులో అఘోరీ తరుపున వాదించడానికి లాయర్ లేకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ లాయర్‌ను పెట్టుకుని వాదించే స్థోమత తనకు లేదని అఘోరీ శ్రీనివాస్ జడ్జికి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలుస్తోంది. అఘోరీ శ్రీనివాస్ వర్షిణీ అనే యువతిని పెళ్లిచేసుకున్న తర్వాత రాధిక అనే మహిళ తెరమీదకు వచ్చిన విషయం తెలిసింది. తనే మొదటి భార్యను అని చెప్పిన రాధిక తనను నమ్మించి మోసం చేసాడని, తన మెడలో తాళి కట్టి వర్షిణీ ని మరో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే అఘోరీ అందరికీ తాళి కట్టడం, పెళ్లి చేసుకోవడం చేస్తున్నాడని రాధిక ఆరోపించింది. తనను పెళ్లి చేసుకున్నాక ఇద్దరం కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని నమ్మించాడని ఫిర్యాదు చేసింది. కాగా దీనిపై విచారించిన కోర్టు తీర్పును వాయిదా వేసింది.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
Also Read : సన్ టీవీ షేర్లు డౌన్.. కష్టాల్లో కావ్య మారన్.. సన్రైజర్స్ ఉంటుందా?
fake lady aghori | court shock to lady aghori | case against lady aghori | case on lady aghori | big twist in lady aghori case