Iran-Israel War: మొన్న సై..ఇవాళ నై...ఇరాన్ కు ముఖం చాటేస్తున్న మిత్ర పక్షం

హమాస్, హెజ్బుల్లా, హౌతీలు, సిరియా, మిలీషియా, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్. ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్న కనిపించడం లేదు.

New Update
iran-allies

iran-allies silent On Israel War

పశ్చిమాసియాలో బలమైన దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సంగతి ఎలా ఉన్నా ఇరాన్ కు మాత్రం అక్కడ చాలా బలం ఉంది. పక్క దేశాలైన లెబనాన్, సిరియా, హౌతీలు, హెజ్బుల్లా, హమాస్, ఇరాన్ ఇవన్నీ కలిపి ఒక గ్రూప్ గా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ ఒంటరిగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ భీకర దాడులు చేసినా కూడా వాళ్ళెవ్వరూ కిక్కురుమనడం లేదు. ఈ మిత్ర బలగాలు అన్నీ ఏమైపోయాయి. ఎందుకు ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది. 

మిత్ర పక్షాలు బలహీనంగా మారాయి..

ఇరాన్‌పై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు వేళ ప్రతిఘటన అక్షం మౌనంగా ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లెబనాన్ లోని హెజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్, యెమెన్ లోని హౌతీలు, ఇరాక్ లోని షియా మిలీషియా గ్రూప్ లు ఇవన్నీ ఇప్పుడు మాయం అయిపోయాయి. ఇరాన్ ఇబ్బందులు పడుతున్నా...అవి మాత్రం కనీసం ఒక మాట కూడా మాట్లాడ్డం లేదు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. ప్రస్తుత నేత నయీమ్ కాసిం తనను తాను లెబనాన్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆయన కార్యాలయంలో ఎక్కడా ఇరాన్ గుర్తులు, ఖమేనీ ఫోటోలు మాత్రం కనిపించడం లేదు.  బషర్ అల్ అసద్ పతనం తరువాత సిరియా ద్వారా అందే సహకారం పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా హెజ్బొల్లా‌కు అవసరమైన నిధులు, ఆయుధ సరఫరాలు ఆగిపోయాయి. హమాస్ సంగతి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. హౌతీల పరిస్థితి కూడా అలానే ఉంది. 

ఇక ఇరాన్ కు 21 దేశాలు మద్దతు నిలిచాయి. కానీ ఇప్పుడు అవి కూడా ముఖం చాటేస్తున్నాయని తెలుస్తోంది. మేమంతా ఇరాన్ వైపే ఉన్నాము..ఇజ్రాయెల్ అన్యాయంగాదాడులు చేస్తోంది అన్నవారంతా..ఇప్పుడు అమెరికా యుద్ధంలోకి దిగుబోతోంది అని తెలిశాక మెల్లిగా పక్కకు తప్పుకుంటున్నాయని చెబుతున్నారు. ఇక రష్యా ఇరాన్ కు మద్దతు ఇస్తున్నా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ దాడులను ఖండించడం వరకే తమ పని అన్నట్టు చేతులు దులుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది. 

 

Also Read: Iran: చమురుకు ఇక కటకటే..హర్మూజ్ ను మూసేస్తామంటున్న ఇరాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు