🔴LIVE BREAKINGS: BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Crime News : వీడసలు మొగుడేనా?...బాత్రూంలో వీడియోలు తీసి భార్యనే బ్లాక్‌ మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి

పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తనపై రహస్యంగా నిఘా పెట్టాడంతో పాటు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిని లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై గూఢచర్యం, బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తన భార్యపై రహస్యంగా నిఘా పెట్టాడని, ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియోలను రికార్డ్ చేశాడని ఆరోపించింది.అప్పులు, కారు EMI చెల్లించడానికి ఆమె తల్లిదండ్రుల నుండి డబ్బు తీసుకురాకపోతే తీసిన వీడియోలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!

తన భర్త లాగే నగరంలో క్లాస్ I ప్రభుత్వ అధికారిణి అయిన ఆ మహిళ, భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఏడుగురుపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపులు, వ్యక్తిగత గోప్యతకు భగ్నం కలిగించడం వంటి నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2020లో వివాహం చేసుకున్న ఈ జంట కొంతకాలం భాగానే ఉన్నారు. కాలక్రమేణా, భర్తకు తన భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగింది. దీంతో ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు.

అంతేకాక ఆమెపై నిఘా పెట్టడానికి, ఆమె కార్యకలాపాలను రహస్యంగా పర్యవేక్షించడానికి, అతను బాత్రూమ్‌తో సహా ఇంటి ఆవరణలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాడు. అతను విధుల్లో ఉన్న సమయంలో కూడా ఆమెను ట్రాక్ చేసేవాడని తెలిసింది. కారు, ఇంటి అప్పులు చెల్లించడానికి తన భార్య తల్లిదండ్రుల నుండి రూ.1.5 లక్షలు తీసుకురాకపోతే ఆమెకు సంబంధించిన స్నానపు వీడియోలను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తానని పదే పదే బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

వివాహం అయినప్పటి నుండి, తన భర్త తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, ఇతరులతో సహా తన అత్తమామలు తనను నిరంతరం వేధించారని, తన తల్లిదండ్రుల ఇంటి నుండి డబ్బు, కారు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొంది. పోలీసులు భర్త, అతని ఏడుగురు బంధువులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద బ్లాక్‌మెయిల్, గృహ హింస, దోపిడీ, గోప్యత ఉల్లంఘన అభియోగాలతో సహా కేసు నమోదు చేశారు.

పోలీసులు ఇంటిలో ఏర్పాటు చేసిన నిఘా పరికరాలను విశ్లేషిస్తున్నారు. మరిన్ని ఆధారాలను సేకరించడానికి ఇంటి నుండి ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు, మహిళ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమ దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Also Read :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

LIVE BREAKINGS

  • Jul 23, 2025 21:49 IST

    Pawan Kalyan Live Song: స్టేజ్‌పైనే పాట ఇరగదీసిన పవన్.. లైవ్ వీడియో సాంగ్ చూశారా?

    వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన 'హరిహర వీరమల్లు' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ లైవ్‌లో పాట పాడారు. తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఖుషి'లోని "బై బయ్యే బంగారు రమణమ్మ" అనే పాటను ఆలపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ పాట ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

     

    vizag pre release event pawan kalyan live song
    vizag pre release event pawan kalyan live song

     



  • Jul 23, 2025 21:48 IST

    Hari Hara Veera Mallu: ‘బావిలో కప్పలకేం తెలుసు’.. రోజాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్..!!

    వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రోజాకు పరోక్షంగా పవన్ మాస్ కౌంటర్ ఇచ్చారు. బావిలో కప్పలా ఉండే వారికి తన విలువ తెలీదన్నారు. తాను ఏ ఊరు వెళ్లినా అక్కడ పెరిగానని చెబుతూ ఉంటా. తన పేరు పవన్ అని.. పవనంలా తిరుగుతుంటా అన్నారు.

     

    pawan kalyan mass counter to roja
    pawan kalyan mass counter to roja

     



  • Jul 23, 2025 21:48 IST

    Dr. Samaram Movie: సె*క్స్ స్పెషలిస్ట్ డా.సమరం నటించిన ఏకైక సినిమా.. మొత్తం బిట్లే!

    నిజమైన మార్గదర్శి అంటే డాక్టర్ సమరం.. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన చెప్పే విషయాలు ఏవి అశ్లీలం కాదు, అవి అవగాహనకు ఎంతో అవసరం. డాక్టర్ సమరం జీవిత ప్రయాణం ఒక వైద్యుని గనే కాదు నటుడిగాను కోనసాగింది. "మీ కోసం" అనే సినిమాలో ఆయన వైద్యుడి పాత్ర చేసి మెప్పించారు.

     

    Dr Samaram Movie
    Dr Samaram Movie

     



  • Jul 23, 2025 19:03 IST

    Hari Hara Veera Mallu: ఇంత అభిమానమేంట్రా.. ‘హరిహర వీరమల్లు’ కోసం ఫ్యాన్స్ ఎలా కష్టపడుతున్నారో చూశారా?

    పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. సినిమా విడుదల ఉత్సాహాన్ని చాటుతూ పలు జిల్లాల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

     

    Pawan fans create a buzz by holding rallies on bikes
    Pawan fans create a buzz by holding rallies on bikes

     



  • Jul 23, 2025 19:02 IST

    Hari Hara Veera Mallu: సంచలన వీడియో.. పవన్ బ్యానర్ చించి కాళ్లతో తొక్కిన కార్యకర్తలు..!!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ థియేటర్ వద్ద నిరసనకారులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలో పేరు కన్నడలో లేదని గొడవకు దిగారు.

     

    Hari Hara Veera Mallu bengaluru banner controversy
    Hari Hara Veera Mallu

     



  • Jul 23, 2025 19:02 IST

    Shocking Video: షాకింగ్ వీడియో.. యువతిని ఉతికారేశాడు - కడుపులో తన్ని, జుట్టు పట్టుకుని ఈడ్చేసిన యువకుడు!

    మహారాష్ట్ర కల్యాణ్ లోని ఓ క్లినిక్ లో రిసెప్షనిస్ట్ పై గోకుల్ ఝా అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. జుట్టు పట్టుకుని లాగి, పిడిగుద్దులతో తన్నిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వెయిట్ చేయమని చెప్పినందుకు ఆ వ్యక్తి ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

     

    A receptionist girl beaten up by a Guy in Kalyan MH
    A receptionist girl beaten up by a Guy in Kalyan MH

     



  • Jul 23, 2025 19:01 IST

    Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. 9మంది అరెస్ట్‌

    HYDలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 286 గ్రాముల కొకైన్‌, 11 గ్రాముల ఎక్స్‌టసీ, తుపాకీ, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

     

    Hyderabad Police arrest 9 people selling drugs
    Hyderabad Police arrest 9 people selling drugs

     



  • Jul 23, 2025 19:00 IST

    Ambati Rambabu: Y.S జగన్‌కు బిగ్ షాకిచ్చిన అంబటి రాంబాబు.. సంచలన ట్వీట్

    పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంపై వైసీపీ నేత అంబటి రాంబాబు షాకింగ్ ట్వీట్ చేశారు. "సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలి" అని ట్వీట్ చేస్తూ, పవన్, నాగబాబులను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

     

    Ambati Rambabu tweet on pawan kalyan hari hara veera mallu movie
    Ambati Rambabu tweet on pawan kalyan hari hara veera mallu movie

     



  • Jul 23, 2025 18:59 IST

    Rain Tips: ఈ వారమంతా వానలే.. ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్!

    మరో వారంపాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. అందువల్ల ప్రజలు కొన్ని సూచనలను ముందుగానే పాటిస్తే టైంను ఎంతో సేవ్ చేసుకోగలుగుతారు. వాతావరణాన్ని ముందుగానే గ్రహించి ఆఫీసుకు బయల్దేరాలి. సరుకులు ముందునే తెచ్చుకోవాలి. వాహనాల్లో పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

     

    monsoon tips
    Rain Tips

     



  • Jul 23, 2025 18:57 IST

    What Happens if Sun Dies: సూర్యుడు మాయమైతే...? జరిగేది ఇదే..!

    సూర్యుడు మాయమైతే సౌరమండలం చీకటిలో అంతరించిపోతుంది. భవిష్యత్‌లో సూర్యుడు ఎరుపు రాక్షసుడి(రెడ్ జెయింట్)గా మారి, భూమి సహా మిగతా గ్రహాల జీవనాన్ని నాశనం చేస్తుంది. చివరికి తెల్లని బుట్టగా మారుతూ మొత్తం సౌరవ్యవస్థ నిశ్శబ్దంగా కనుమరుగవుతుంది.

     

    What Happens if Sun Dies
    What Happens if Sun Dies

     



  • Jul 23, 2025 15:34 IST

    Mission Impossible Final Reckoning OTT: టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్: డిజిటల్ రిలీజ్ అప్పుడే..!

    టామ్ క్రూజ్ నటించిన "మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్" 2025 ఆగస్టు 19న డిజిటల్‌గా విడుదల కానుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా, అదనపు బోనస్ కంటెంట్‌తో పాటు, అక్టోబర్ 14న 4K బ్లూ-రే/DVDగా కూడా రానుంది.

     

    Mission Impossible Final Reckoning OTT
    Mission Impossible Final Reckoning OTT

     



  • Jul 23, 2025 14:32 IST

    Raja Singh: రాజాసింగ్ యూటర్న్.. తెలంగాణ బీజీపీలో వేగంగా మారుతున్న పరిణామాలు!

    ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    Raja singh U Turn



  • Jul 23, 2025 13:50 IST

    BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్

    బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు.

    Dharmapuri Arvind

     



  • Jul 23, 2025 13:38 IST

    మహిళల అక్రమ రవాణాగుట్టు రట్టు

    పశ్చిమబెంగాల్‌ నుంచి బిహార్‌ తరలిస్తున్న అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో వీరిని నమ్మించి మోసం చేసినట్లు తేలడంతో యువతులతో పాటు వారిని తరలిస్తున్న ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

    Human Trafficking



  • Jul 23, 2025 13:06 IST

    ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి... చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..

    ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తున్న బండి హారిక (20), గాడిపల్లి శ్రీకాంత్ (24) లు ప్రేమించుకుంటున్నారు.

    Couple commits suicide in Khammam



  • Jul 23, 2025 12:34 IST

    మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మినిస్టర్ నారా లోకేష్ హరిహర వీరమల్లు చిత్రబృందానికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.

     

    nara lokesh tweet on harihara veeramallu
    nara lokesh tweet on harihara veeramallu

     



  • Jul 23, 2025 12:23 IST

    నాగర్ కర్నూలు జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

    నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, పాత పునాదులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సిఫార్సు చేయటంతో కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Panchayat Secretaries



  • Jul 23, 2025 11:47 IST

    మళ్లీ పరువు తీసుకున్న పాకిస్తాన్.. సొంత దేశంలోనే కూలిన క్షిపణి.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు

    పాకిస్తాన్ సైన్యం షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ టెస్ట్ ఫెయిలైంది. షాహీన్ క్షిపణి టార్గెట్ తప్పి పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి శిథిలాలు బలూచిస్తాన్‌లోని డేరా బుగ్టి జిల్లాలో పడ్డాయి.

    Missile test fail



  • Jul 23, 2025 11:46 IST

    తెలంగాణలో ద్రోణి ప్రభావం...మరో రెండు రోజులు దంచుడే..దంచుడు

    తెలంగాణలో ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.



  • Jul 23, 2025 11:26 IST

    యూఎన్ లో పాక్ మళ్ళీ భంగపాటు..అప్పులు అడుక్కుంటోందంటూ భారత్ చురకలు

    టైమ్ దొరికితే చాలు భారత్ మీద పడి ఏడుస్తుంటుంది పాకిస్తాన్. ఐక్యరాజ్య సమతిలో మళ్ళీ అదే చేయాలనుకుంది కానీ భారత్ చేతిలో చావు దెబ్బలు తింది. పాకిస్తాన్ అప్పుడు అడుక్కోవడంతో బిజీగా ఉందంటూ భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాక్ నోరు మూయించారు. 

     

    India In UN
    India In UN

     



  • Jul 23, 2025 11:25 IST

    వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించండి.. హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు!

    హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి ఐటీ కంపెనీలు బుధవారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని సూచించారు. 

    Telangana Rains🔴LIVE Updates : దంచికొడుతున్న వాన | Heavy Rains To Hit For Next 3 Days | Hyderabad



  • Jul 23, 2025 11:25 IST

    ట్యాంక్‌బండ్‌పై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు

    హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొంది. కారు వెనుక టైర్‌లో గాలి తక్కువ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారులో బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఎవరూ గాయపడలేదు.

    car accident balakrishna



  • Jul 23, 2025 10:20 IST

    పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు

    మనదేశంలో పరువు హత్యలు జరుగుతుంటాయి. అయితే ఇది ఒక్క మన దేశంలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చాలా ఎక్కువే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఓ పరువు హత్య తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

     

    pak murder
    Pak woman's dishonour-killing

     



  • Jul 23, 2025 10:19 IST

    ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్‌ బ్యాచ్‌

    రాష్ట్ర వ్యాప్తంగా గంజాయ్‌ బ్యాచ్‌ రెచ్చిపోతుంది. రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయ్ లభిస్తుండటంతో గ్రామాల్లో సైతం గంజాయ్‌ బ్యాచ్‌లు వీరంగం సృష్టిస్తున్నాయి. తాజాగా  పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్‌ ఆర్టీసీ బస్సుకు ఆకతాయి గంజాయ్‌ గ్యాంగ్‌ నిప్పుపెట్టింది.

    Ganjai batch sets fire to RTC bus



  • Jul 23, 2025 09:26 IST

    జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?

    ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనికి కారణం ఆయన ఆరోగ్యమే అని చెబుతున్నా..తెర వెనుక జరిగింది మరొకటి అని అంటున్నారు. హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారమే దెబ్బ కొట్టిందని అంచనా.

     

    Jagdeep dhankar
    Jagdeep dhankar

     



  • Jul 23, 2025 09:25 IST

    భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు

    భార్య, ఆమె బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు.

    Piduguralla crime



  • Jul 23, 2025 09:24 IST

    వీడసలు మొగుడేనా?...బాత్రూంలో వీడియోలు తీసి భార్యనే బ్లాక్‌ మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి

    పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తనపై రహస్యంగా నిఘా పెట్టాడంతో పాటు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిని లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

    Government official blackmails wife by filming videos in bathroom



  • Jul 23, 2025 09:24 IST

    ఇదేం చోరీరా నాయనా..సైబర్‌ నేరగాళ్ల సొమ్ముతో ఉడాయించిన పోలీసు జంట..ట్విస్ట్‌ ఏంటంటే?

    సైబర్‌ నేరగాళ్లు కాజేసిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేసిన పోలీసుజంట అదే సొమ్ముతో ఉడాయించడం సంచలనం రేపింది. ఈ కేసులో ఓ ఎస్సైతో పాటు మరో మహిళా ఎస్సై కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

    Police couple flees with cybercriminals' money



  • Jul 23, 2025 08:02 IST

    ఇదేం ఘోరం...వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌కు మద్దతు పలికితే చంపేస్తారా? భయ్యా..

    కుల సంఘం ఎన్నికలు ఒక వ్యక్తి ప్రాణాలను తీశాయి. అది కూడా వాట్సప్‌ గ్రూపులో పెట్టిన ఓ పోస్టుకు లైక్‌ చేయడమే ఆయన తప్పైంది. ప్రత్యర్థులు ఆయనను కొట్టి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది.

    Caste community elections that took a person's life



  • Jul 23, 2025 08:01 IST

    Harihara Veeramallu పై నా అన్వేష్ సంచలన వ్యాఖ్యలు.. అందర్నీ వేసుకున్నాడు భయ్యా!!

    య్యూటుబర్ నా అన్వేష్ సౌతాఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని, రివ్యూపేరుతో సినిమాలకు రివ్యూలు ఇచ్చే వారిపై ఫైర్ అయ్యాడు. ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తోంది.

    Na Anvesh



  • Jul 23, 2025 08:00 IST

    అగ్రరాజ్యం జాక్ పాట్..జపాన్ తో బిగ్ డీల్

    మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు.

    Read More



  • Jul 23, 2025 07:59 IST

    భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?

    విదేశాలకు టూర్ వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఇక నుంచి భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. వీసా లేకుండా అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి హెన్లీ పాస్‌పోర్టు సూచీ 2025 విడుదలైంది.

    Henley Passport Index



  • Jul 23, 2025 07:59 IST

    సరూర్‌నగర్‌ కిడ్నీరాకెట్‌ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ అలకనందా ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్‌ కీలక సూత్రదారిగా భావిస్తున్న పవన్‌ ఎలియాస్‌ లియోన్‌  తెలంగాణ సీఐడీ పోలీసులకు చిక్కాడు.

    Hyderabad Kidney Transplant Racket



  • Jul 23, 2025 07:02 IST

    ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు

    రాష్ట్రంలో బుధవారం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



Advertisment
తాజా కథనాలు