BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్

బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు.

New Update
Dharmapuri Arvind

బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు. అవసరమైతే అధిష్టాన పెద్దలు కలగజేసుకోవాలని సూచించారు. ఈటల, బండి సంజయ్‌ల విషయంలో సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలని ధర్మపురి అర్వింద్ కోరారు. అలాగే రాజాసింగ్ ఎక్కడున్నా మేము గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు రిజైన్ చేశాడని అన్నారు.

రేపు పార్టీ సభ్యత్వం కోసం పిలిస్తే తిరిగి మెంబర్షిప్ తీసుకొచ్చని తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజసింగ్ పార్టీకి రాజీనామ చేశారని అన్నారు. తెలంగాణ బిజెపి ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని చెప్పారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. స్థానికలు ఎన్నికలు దగ్గరపడుతున్నందున కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇది అని అన్నారు. రాజకీయ పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి, వరంగల్‌లో కొండా దంపతులు,   బీఆర్ఎస్‌లో కవిత, కేటీఆర్ వివాదాల గురించి ఆయన గుర్తు చేశారు.

Advertisment
తాజా కథనాలు