Hari Hara Veera Mallu: ‘బావిలో కప్పలకేం తెలుసు’.. రోజాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్..!!

వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రోజాకు పరోక్షంగా పవన్ మాస్ కౌంటర్ ఇచ్చారు. బావిలో కప్పలా ఉండే వారికి తన విలువ తెలీదన్నారు. తాను ఏ ఊరు వెళ్లినా అక్కడ పెరిగానని చెబుతూ ఉంటా. తన పేరు పవన్ అని.. పవనంలా తిరుగుతుంటా అన్నారు.

New Update
pawan kalyan mass counter to roja

pawan kalyan mass counter to roja

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ఏపీలోని వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అంతేకాకుండా వేదికపై ఆయన స్పీచ్‌కు ఫ్యాన్స్, సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. 

Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

Hari Hara Veera Mallu

ఇదే వేదికపై పరోక్షంగా రోజాకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. బావిలో కప్పలా ఉండే వారికి తన విలువ తెలీదన్నారు. తన నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా ఉండేవాడని.. అందువల్ల తరచూగా ఆయనకు ట్రాన్షఫర్‌లు అయ్యేవని అన్నారు. కావున తన తండ్రి ఏ ఊరు వెళ్లినా అక్కడ పెరిగానని చెబుతూ ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు రోజాకు కౌంటర్ ఇచ్చినట్లుగా పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల రోజా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఎక్కడికి వెళ్లినా తన ఊరు అని చెప్పుకుంటాడంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు