Crime News : ఇదేం ఘోరం... వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌కు మద్దతు పలికితే చంపేస్తారా? భయ్యా..

కుల సంఘం ఎన్నికలు ఒక వ్యక్తి ప్రాణాలను తీశాయి. అది కూడా వాట్సప్‌ గ్రూపులో పెట్టిన ఓ పోస్టుకు లైక్‌ చేయడమే ఆయన తప్పైంది. ప్రత్యర్థులు ఆయనను కొట్టి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది.

New Update
Caste community elections that took a person's life

Caste community elections that took a person's life

కుల సంఘం ఎన్నికలు ఒక వ్యక్తి ప్రాణాలను తీశాయి. అది కూడా వాట్సప్‌ గ్రూపులో పెట్టిన ఓ పోస్టుకు లైక్‌ చేయడమే ఆయన తప్పైంది. ప్రత్యర్థులు ఆయనను కొట్టి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. సూర్యాపేట జిల్లా పద్మశాలీ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

WhatsApp Group Message Crime

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధానమైన నామినేషన్ల పర్వం ఈ సోమవారం ముగిసింది.  దీనికి సంబంధించిన ఎన్నికలు వచ్చే నెల 3న జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ఉన్న క్రమంలో కుల సంఘానికి సంబంధించిన వాట్సప్‌ గ్రూపులో వాడివేడిగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంఘం అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అప్పం శ్రీనివాస్‌ సంఘానికి సంబంధించిన నిధులను కాజేశారంటూ శ్రీరాముల రాములు అనే వ్యక్తి  ఆ గ్రూపులో ఓ పోస్ట్‌ పెట్టాడు. అయితే ఈ పోస్టుకు బదులుగా అప్పం శ్రీనివాస్‌ తన వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా సూర్యాపేట భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన మానుపురి కృపాకర్‌ వివరణ పోస్ట్‌కు మద్దతు పలుకుతూ క్లాప్స్‌ ఎమోజీని వాట్సప్ గ్రూపులో పెట్టాడు.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

ఈ క్రమంలో ఆ గ్రూపునకు అడ్మిన్‌గా ఉన్న రాములు.. కృపాకర్‌ పెట్టిన ఎమోజీని తొలగించాడు. అనంతరం ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు.  దీంతో  మనస్తాపానికి గురైన కృపాకర్‌ సంఘం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు కస్తూరి బజారులోని పద్మశాలీ భవనానికి వెళ్లారు. అక్కడే ఉన్న రాములు, అతని కుమారుడు ధనుంజయ్‌తోపాటు స్నేహితులు తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ కృపాకర్‌పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను సంఘం సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు.  నగరంలో ఫుట్‌వేర్‌ షాపు నిర్వహిస్తున్న కృపాకర్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబం అనాథగా మిగిలింది. కుటుంబ సభ్యలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తెలిపారు.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Also Read :  పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు

latest-news-about-watsapp | elections | crime news today | crime news telangana | crime news telugu | suryapet district news | suryapet

#crime news #elections #suryapet #latest-news-about-watsapp #crime news telangana #crime news today #crime news telugu #suryapet district news
Advertisment
తాజా కథనాలు