Crime News: సరూర్‌నగర్‌ కిడ్నీరాకెట్‌ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ అలకనందా ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్‌ కీలక సూత్రదారిగా భావిస్తున్న పవన్‌ ఎలియాస్‌ లియోన్‌  తెలంగాణ సీఐడీ పోలీసులకు చిక్కాడు.

New Update
Hyderabad Kidney Transplant Racket

Hyderabad Kidney Transplant Racket

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ అలకనందా ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్‌ కీలక సూత్రదారిగా భావిస్తున్న పవన్‌ ఎలియాస్‌ లియోన్‌  తెలంగాణ సీఐడీ పోలీసులకు చిక్కాడు.  గత జనవరిలో వెలుగు చూసిన ఈ ఘటనలో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అలకనందా ఆసుపత్రి యజమాని సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిని  డీహెచ్‌ఎంవో సీజ్‌ చేశారు.  అప్పటి నుంచి నిందితులకోసం వెతుకుతున్న పోలీసులకు ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో పవన్ చిక్కాడు.

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Alakananda Kidney Racket

అలకనందతో పాటు పలు ఆసుపత్రులలో అక్రమంగా కిడ్నీ మార్పిళ్లకు పాల్పడిన ముఠాకు పవన్‌ను సూత్రధారిగా ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఈకేసులో ఇప్పటికే పదిమందికిపైగా వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు, దళారులను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పవన్‌ శ్రీలంకకు, మరికొందరు ఇతర ప్రాంతాలకు పారిపోయాడు.  వపన్‌ గతంలోనూ శ్రీలంక, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైల్లో అతడు కిడ్నీరాకెట్‌ నిర్వహించినట్లు సీఐడీ పోలీసులు నిర్ధారించారు. కాగా  రాచకొండ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. పవన్‌ ఓవైపు శ్రీలంకలో కేసినో నిర్వహిస్తూనే భారత్‌లో కిడ్నీ దందా సాగించినట్లు వెల్లడైంది. గతంలోనే సీఐడీ అతడి కారును స్వాధీనం చేసుకుంది. అతడి కుటుంబసభ్యులపై నిఘా ఉంచింది. ఈక్రమంలోనే అతడు తిరిగి ఇండియా వచ్చినట్లు ఎల్‌బీనగర్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో గాలించి పట్టుకొంది. 

Also Read: దరిద్రం అంటే వీడిదే.. భర్తని నదిలోకి తోసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తపైనే కేసు

కాగా, సీఐడీ పోలీసుల ఎంక్వయిరీలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పవన్‌ గతంలో కిడ్నీరాకెట్‌ వలకు చిక్కి తానే స్వయంగా కిడ్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చినట్లు తెలిసింది. ఈదందాలో దళారులకే ఎక్కువగా లాభం వస్తుందని గ్రహించి తానే కిడ్నీ రాకెట్‌ రంగంలోకి దిగాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారిని గుర్తించేందుకు ఏజెంట్లను నియమించుకుని కిడ్నీ గ్రహీతల సమాచారాన్ని సేకరించేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న ఆసుపత్రుల యజమానులను గుర్తించి వారికి లాభం వచ్చే మార్గాలను తెలిపేవాడు. అలా ఈ దందాలో సొంతంగా ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో కిడ్నీమార్పిడికి గ్రహీతల నుంచి రూ.50లక్షల నుంచి రూ.60లక్షలను వసూలు చేసి డాక్టర్లకు కొంత, దాతలకు రూ.5లక్షలు, దళారులకు కొంత ఇచ్చేవాడు.

Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

అలా రూ.15లక్షల వరకు ముట్టజెప్పేవాడు. అలా ఒక్కో ఆపరేషన్‌కు ఎంతలేదన్న రూ.30లక్షల వరకు మిగులుతాయి.  అలా చాలాకాలంగా ఈ వ్యవహారంలో పవన్‌ నేరాలు చేస్తూనే ఉన్నాడు. ఒక చోట కేసు నమోదైతే మరో చోటకు మకాం మార్చేవాడు. అలా గతంలో వైజాగ్‌లో ఒక కేసులో పవన్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అయితే పోలీసులకు అతడి ఆనవాళ్లు తెలియకపోడంతో పవన్‌ పేరుతో ఉన్న మరో వ్యక్తిని తన స్థానంలో పంపాడు. అతడే సూత్రధారి పవన్‌ అనుకొని వైజాగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. కానీ, అసలు పవన్‌ మాత్రం తన దందా యధేచ్ఛగా కొనసాగిస్తూ వస్తున్నాడు. కానీ, చివరికి  సీఐడీ పోలీసులకు చిక్కక తప్పలేదు.

Also Read: Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!

kidney racket in hyderabad | Kidney Racket In Alaknanda Hospital | Kidney Racket In Alaknanda | kidney racket case | kidney racket at hyderabad | cid on hyderabad kidney racket | kidney racket

Advertisment
తాజా కథనాలు